Tamannah | మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం కెరీర్‌లో జోరు కొనసాగిస్తున్నారు. వరుస సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టులు, ఐటమ్ సాంగ్స్‌తో బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టారు. నటిగా మాత్రమే కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా గుర్తింపు పొందాలనే లక్ష్యంతో తమన్నా సొంత జ్యువెలరీ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా సాగి సినీ ప్రముఖులతో కిక్కిరిసింది. ఈ వేడుకకు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్, కాజల్ అగర్వాల్, వాణీ కపూర్, సమంత వంటి పలువురు స్టార్ హీరోయిన్లు హాజరై తమన్నాకు శుభాకాంక్షలు తెలిపారు. డెనిమ్ థీమ్‌తో స్టైలిష్‌గా జరిగిన ఈ కార్యక్రమం సెలబ్రిటీల సందడితో కళకళలాడింది. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ప్రత్యేక అతిథిగా వచ్చిన నటి ఫాతిమా సనా షేక్.
ఫాతిమా సనా షేక్ హాజరు కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు కారణం ఆమె ప్రస్తుతం నటుడు విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం వినిపిస్తుండటమే. ‘గుస్తాఖ్ ఇష్క్’ చిత్రంలో కలిసి నటించిన తర్వాత వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, రిలేషన్‌లో ఉన్నారనే వార్తలు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీంతో తమన్నా ఈవెంట్‌కు ఫాతిమా రావడం ఆసక్తికర చర్చలకు దారితీసింది.ఇక్కడే విజయ్ వర్మ పేరు మళ్లీ ప్రస్తావనలోకి వచ్చింది. గతంలో ‘లస్ట్ స్టోరీస్ 2’ చిత్రీకరణ సమయంలో పరిచయమైన తమన్నా–విజయ్ వర్మ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి.
పలుమార్లు కలిసి ఈవెంట్లలో కనిపించిన ఈ జంట తమ రిలేషన్‌పై ఇంటర్వ్యూల్లో కూడా ఓపెన్‌గా మాట్లాడటం అప్పట్లో వైరల్ అయింది. అయితే కొన్ని నెలలుగా ఇద్దరూ కలిసి కనిపించకపోవడంతో బ్రేకప్ రూమర్లు బలపడ్డాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ వర్మ ప్రస్తుత ప్రేయసిగా ప్రచారం జరుగుతున్న ఫాతిమానే తమన్నా ఆహ్వానించడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఇది వైరల్ కాగా, బాలీవుడ్‌లో ఫ్రెండ్లీ రిలేషన్లు సాధారణమే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా తమన్నా వ్యక్తిగత విషయాలను పక్కనబెట్టి కెరీర్, బిజినెస్‌లపై దృష్టి పెట్టిందనేది ఈ ఈవెంట్ ద్వారా స్పష్టమైంది. జ్యువెలరీ బ్రాండ్ లాంచ్‌తో తమన్నా మరో కొత్త దిశలో అడుగులు వేయగా, ఫాతిమా ఎంట్రీతో ఈ కార్యక్రమం మరింత హైలైట్ అయింది.
