విధాత: సారూ మా పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయి. ఆ పురుగులన్నం తినబుద్దైతలేదు. అయినా అదే తినాలని మా టీచర్లు చెబుతున్నారు. తినకపోతే టీసీ ఇచ్చి ఇంటికి పంపుతరట. అందుకే ఇవాళ స్కూల్కు పోలే. వాళ్ల మీద కేసు పెట్టడానికి మీ కాడికి వచ్చినస ఒక చిన్నారి పోలీసు స్టేషన్‌కి వచ్చి వాపోయింది. పూర్తి వివరాలు..
ప్రశాంతిహిల్స్‌లో నివాసం ఉంటున్న శ్రీను కుమార్తె పూజిత స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్లో పై విధంగా ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన సీఐ మహేందర్ రెడ్డి వెంటనే తమ సిబ్బందిని పాఠశాలకు పంపించారు.
అక్కడికి వెళ్లి పరిశీలించగా నిజంగానే కూరగాయలు బాగోలేవని, బియ్యం కూడా మట్టి పట్టి ఉన్నట్లు గుర్తించారు. ఆ చిన్నారి చూపిన ధైర్యాన్ని పోలీసులు అభినందించి పాఠశాల యాజమాన్యంపై చర్యలు చేపట్టారు.