Kiss Clash| ముద్దు రేపిన చిచ్చు..ఇరువర్గాల మధ్య ఘర్షణ

విధాత, హైదరాబాద్ : ఓ ముద్దు రీల్ రెండు వర్గాల మధ్య తీవ్రఘర్షణకు దారితీసింది. రెండు కుటుంబాలను పోలీస్ కేసుల పాలు చేసింది. వివరాల్లోకి వెళితే వరంగల్ కొత్త వాడకు చెందిన మైనర్ బాలిక, బాలుడు ముద్దు పెట్టుకుంటు తీసుకున్న ఓ రీల్ ఇన్ స్ట్రాగ్రామ్ లో వైరల్ కావడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ తలెత్తింది. ఘర్షణలో రెచ్చిపోయిన సుమారు 50 మంది యువకులు, మహిళలు పరస్పరం దాడిచేసుకున్నారు. యువకుల మారణాయుధాలతో దాడులకు దిగడంతో ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి.

రెండు వర్గాల కుటుంబాలను పోలీసుల అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంతో ఉద్రిక్తత నెలకొంది.