Site icon vidhaatha

బ్రిటన్ ప్రధాని రాజీనామా.. మోదీపై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్

Minister KTR | సరైన ఆర్థిక విధానాన్ని అమలు చేయలేకపోయిన బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రధానిగా పదవి బాధ్యతలు స్వీకరించిన ట్రస్ 45 రోజులకే ట్రస్ రాజీనామా చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇదే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీపై కేటీఆర్ సెటైర్లు వేశారు.

ఇండియాలో మాకు మోదీ ఏం ఇచ్చారంటే.. ఈయన పాలనలో దేశం చాలా హీనస్థితికి చేరిందని మండిపడ్డారు. గడిచిన 30 ఏండ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఉంది. 45 ఏండ్లలో ఎప్పుడూ లేనంత ద్రవ్యోల్బణం ఉంది. ఇంధన ధరలు ప్రపంచంలోనే అత్యధికంగా మన దగ్గర ఉన్నాయి. అమెరికా డాలర్ తో పోలిస్తే.. రూపాయి విలువ అత్యంత దారుణంగా పతనమైందని కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ కు #TolerantIndia అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు.

ఆర్థిక విధానాలు సరిగా లేకపోవడం వల్ల 45 రోజులకే బ్రిటన్ ప్రధాని ట్రస్ రాజీనామా చేస్తే.. ఇండియాలో మోదీ ప్రభుత్వం ఆర్థికంగా ఘోరంగా విఫలమైనప్పటికీ, ఇప్పటికీ ప్రధాని పదవిలో మోదీ కొనసాగుతున్నారని అర్థం వచ్చేలా కేటీఆర్ ట్వీట్ ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version