Mohammed Faizal | లక్షద్వీప్ ఎంపీ ఫైజల్ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ

విధాత‌: లక్షద్వీప్ పార్లమెంటు సభ్యుడు మహమ్మద్ ఫైజల్ (Mohammed Faizal) లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించినట్టు లోక్ సభ సచివాలయం వెల్లడించింది. ఇటీవల రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన నేపథ్యంలో ఈ ఉత్తర్వు ప్రాధాన్యం సంతరించుకున్నది. లక్షద్వీప్ రాజధాని అయిన కారావట్టిలోని సెషన్స్ కోర్టు జనవరి 11వ తేదీన ఒక హత్యాయత్నం కేసులో ఫైజల్‌కు శిక్ష విధించింది. దీనిని ప్రాతిపదికగా చేసుకొని లోక్ సభ సచివాలయం జనవరి 13వ తేదీన ఫైజల్ సభ్యత్వం […]

  • Publish Date - March 29, 2023 / 10:52 AM IST

విధాత‌: లక్షద్వీప్ పార్లమెంటు సభ్యుడు మహమ్మద్ ఫైజల్ (Mohammed Faizal) లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించినట్టు లోక్ సభ సచివాలయం వెల్లడించింది. ఇటీవల రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన నేపథ్యంలో ఈ ఉత్తర్వు ప్రాధాన్యం సంతరించుకున్నది.

లక్షద్వీప్ రాజధాని అయిన కారావట్టిలోని సెషన్స్ కోర్టు జనవరి 11వ తేదీన ఒక హత్యాయత్నం కేసులో ఫైజల్‌కు శిక్ష విధించింది. దీనిని ప్రాతిపదికగా చేసుకొని లోక్ సభ సచివాలయం జనవరి 13వ తేదీన ఫైజల్ సభ్యత్వం రద్దయినట్టు ప్రకటించింది. కానీ సెషన్స్ కోర్టు తీర్పును ఫైజల్ హైకోర్టులో సవాలు చేశారు. ఫైజల్ కు విధించిన శిక్షను సస్పెండ్ చేస్తూ జనవరి 25న హైకోర్టు ఆదేశాలిచ్చింది.

హైకోర్టు తనపై శిక్షను సస్పెండ్ చేసినప్పటికీ తన లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదని ఫైజల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఉప ఎన్నిక కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ను ఎన్నికల కమిషన్ ఉపసంహరించుకున్నదని కూడా ఫైజల్ తెలిపారు. ఈ నేపథ్యంలో లోక్ సభ సచివాలయం ఫైజల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది.

రాహుల్ గాంధీకి కూడా సూరత్ కోర్టు శిక్ష విధించిందనే కారణంగా హడావుడిగా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు లోక్ సభ సచివాలయం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫైజల్ సభ్యత్వం పునరుద్ధరణ ప్రాధాన్యం సంతరించుకున్నది.

Latest News