వటపత్ర శాయిగా.. దర్శనమిచ్చిన లక్ష్మీనారసింహుడు

విధాత: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారు ఉదయం వటపత్ర శాయి అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. జగద్రక్షకుడైన పరమాత్మ వటపత్ర శాయిగా సృష్టిని తిరిగి ప్రారంభించి బ్రహ్మాది దేవతల ద్వారా జీవకోటి మనుగడకు దిశా నిర్దేశం చేయగా, వటపత్ర శాయి రూపంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆనందపరవశులయ్యారు. సాయంకాలం నిత్యారాధన అనంతరం అధ్యయనోత్సవాల్లో భాగంగా యాదగీరిశుడు వైకుంఠనాథుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహించగా భ‌క్తులు తిల‌కించి […]

  • Publish Date - January 6, 2023 / 02:24 PM IST

విధాత: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారు ఉదయం వటపత్ర శాయి అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు.

జగద్రక్షకుడైన పరమాత్మ వటపత్ర శాయిగా సృష్టిని తిరిగి ప్రారంభించి బ్రహ్మాది దేవతల ద్వారా జీవకోటి మనుగడకు దిశా నిర్దేశం చేయగా, వటపత్ర శాయి రూపంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆనందపరవశులయ్యారు.

సాయంకాలం నిత్యారాధన అనంతరం అధ్యయనోత్సవాల్లో భాగంగా యాదగీరిశుడు వైకుంఠనాథుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఆలయ మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహించగా భ‌క్తులు తిల‌కించి ప‌ర‌వ‌శించిపోయారు. వైకుంఠ నాధుడి అలంకారంలోని స్తంబోద్భవుడైన లక్ష్మీ నరసింహుడిని దర్శించుకుని త‌రించారు.