Hyderabad | భూముల ధరల రిగ్గింగ్..? భూమికి దూరమవుతున్ననగర ప్రజలు

Hyderabad | కోకాపేట ప్రభావం నగరంపై.. పెరిగిన ఫ్లాట్ల ధరలు, ఇండ్ల అద్దెలు భూమికి దూరమవుతున్ననగర ప్రజలు లక్ష వేతనం వచ్చినా సొంతిళ్లు కలే.. బహుళ అంస్థుల ఫలితాలు ప్రజలకేవి, పార్క్ లేవి విధాత: ప్రభుత్వం, బడా నిర్మాణ సంస్థలు భూముల ధరల రిగ్గింగ్ కు పాల్పడుతున్నాయా? అంటే అవుననే సమాధానం వివిధ వర్గాల నుంచి వస్తోంది. సామాన్యప్రజలు జీవించడానికి అనువుగా ఉన్న హైదరాబాద్ నేడు మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటులో […]

  • Publish Date - August 14, 2023 / 01:53 AM IST

Hyderabad |

  • కోకాపేట ప్రభావం నగరంపై..
  • పెరిగిన ఫ్లాట్ల ధరలు, ఇండ్ల అద్దెలు
  • భూమికి దూరమవుతున్ననగర ప్రజలు
  • లక్ష వేతనం వచ్చినా సొంతిళ్లు కలే..
  • బహుళ అంస్థుల ఫలితాలు ప్రజలకేవి, పార్క్ లేవి

విధాత: ప్రభుత్వం, బడా నిర్మాణ సంస్థలు భూముల ధరల రిగ్గింగ్ కు పాల్పడుతున్నాయా? అంటే అవుననే సమాధానం వివిధ వర్గాల నుంచి వస్తోంది. సామాన్యప్రజలు జీవించడానికి అనువుగా ఉన్న హైదరాబాద్ నేడు మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా పోతుందని నిర్మాణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాలలోకూడా సామాన్య ప్రజల నుంచి భూమిని దూరం చేస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్త మవుతోంది. హైదరాబాద్ కు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ ఎస్ ఐ) లేక పోవడంతో ఎన్ని అంతస్థులైనా నిర్మించడానికి బడా సంస్థలకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారు. దీంతో కోకాపేట ఎకరానికి రూ.100 కోట్లు పెట్టారు. కోకాపేట ప్రభావం నగర మంతా చూపించనున్నది.

ఫ్లాట్ల ధరలు సగానికి పైగా పెరుగుతుండగా, కోకాపేట పేరు చెప్పి ఇంటి అద్దెలు కూడా పెంచుతున్నారని సగటు నగర జీవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. వంద కోట్లకు ఎకరం భూమి అంటే హైదారాబాద్ లో సాధారణ ప్రజలకు ధరలు అందుబాటులో లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందని, ధీర్ఘకాలంగా రియాల్టీ మార్కెట్ కు హాని చేస్తుందని ఒక సాధారణ బిల్డర్ ఆవేదన వ్యక్తం చేశారు.

కోకాపేట, బుద్వెల్ లలో జరిగిన వేలం పాటల తీరు చూస్తే కాంట్రాక్టర్ల సిండికేట్ లాగా రియల్ ఎస్టేట్ సిండికేట్ నడుస్తున్నదా?అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయన్నారు.

Ticket Tension | టికెట్ల టెన్షన్‌! మొదటి జాబితాలో వస్తుందా? లేదా?

ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) అంటే ఏమిటి?

ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) అన్నా ఫ్లోర్ ఏరియా రేషియా(ఎఫ్ఏఆర్) అన్నా ఒకటే. ఒక నిర్దిష్ట స్థలంలో గరిష్టంగా నిర్మించడానికి అనుమతించే విస్తీర్ణం. అంటే గజం స్థలంలో రెండు గజాల విస్తీర్ణం కట్టుకోవచ్చు అంటే, అక్కడ ఎఫ్ఎస్ఐ ఒకటి నిష్పత్తి రెండుగా ఉందని అర్థం. నిలువుగా రెండు గజాల విస్తీర్ణంలో నిర్మించుకోవడం అన్నమాట.

వంద గజాల స్థలం ఉంటే రెండు వందల గజాల విస్తీర్ణం వరకు కట్టుకోవచ్చు. ఎఫ్ఎస్ఐ జాతీయ సగటు 2.5. అంటే వంద గజాల స్థలంలో 250 గజాల విస్తీర్ణం కట్టుకోవచ్చు. దీనినే మరో విధంగా చెప్పాలంటే (వంద గజాలు అంటే) 900 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిలువుగా 2250 చదరపు అడుగుల్లో భవంతి కట్టుకోవచ్చు.

ఈ నిష్పత్తి ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఒకే నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు నిష్పత్తుల్లో కూడా ఉంటుంది. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పార్కులు వంటి మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిష్పత్తిని ఖరారు చేస్తారు.

Kokapet | కోకాపేట‌లో.. ఎక‌రం రూ.100 కోట్లు

ఆర్టిఫిషియల్ భూమ్

హెచ్ ఎండీఏ ఆగస్టు 2వ తేదీన నిర్వహించిన వేలంలో కోకాపేటలో ఎకరం వంద కోట్ల ధరపెట్టి రెండు బడా సంస్థలు కన్సారియంగా ఏర్పడి కొనుగోలు చేయడం వెనకాల మతలబు ఏమిటన్న చర్చ జరుగుతోంది. కోకా పేట భూముల వేలంతో కేసీఆర్ స‌ర్కార్ ఆర్టిఫిషియ‌ల్ రియ‌ల్ భూమ్ క్రియేట్ చేసిందా? అన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి.

Land Auction | మోకిల.. రెండో ఫేజ్ భూముల వేలానికి నోటిఫికేషన్‌

వాస్తవంగా 2021 జూలై 15న కోకాపేటలోనే ఎకరం భూమి అత్య‌ధికంగా రూ. 60 కోట్లు అత్య‌ల్పంగా రూ. 30 కోట్ల‌కు అమ్ముడు పోయాయి. కేవ‌లం రెండేళ్ల వ్య‌వ‌ధిలో ఒక్క‌ ఎక‌రానికి ఒకేసారి రూ.40 కోట్లు పెరిగి రూ.100.75 కోట్లు ప‌లుకుతుందా? ఎలా సాధ్యమవుతుందన్న చర్చ రియల్ ఎస్టేట్ వర్గాలలో జరుగుతున్నది.

నెలకు లక్ష సంపాదించినా…

నెలకు లక్షరూపాయల వేతనం పొందే ఉద్యోగి కూడా హైదరాబాద్ లో అపార్ట్ మెంట్ లో ఒక ఫ్లాటు కొనే పరిస్థితి లేదని ధీరజ్ అనే వ్యాపార వేత్తా ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో లక్ష వేతనమంటే చాలా మంచి జీతమని,అలాంటి వాళ్లే కోటి రూపాయలు పెట్టి ఫ్లాట్ కొనే పరిస్థితి లేనప్పుడు అంత కంటే తక్కువ వేతనం కోసం ఉద్యోగం చేసే వాళ్లే అధికంగా ఉంటారన్నారు. ఇప్పటి ధరలను చూస్తే మధ్యతరగతికి ధరలు అందుబాటులో లేవని అర్థమవుతుంది.

Megastar Chiranjeevi | స్వ‌యంకృషి నుంచి.. స్వ‌యంకృతాప‌రాధం దాకా!

60 శాతం మిడిల్ క్లాసే..

కరోనా కాలంలో అనేక మంది ఉద్యోగ, ఉపాధి అవకా శాలు కోల్పోయారు. అనేక సంస్థలు ఖర్చు తగ్గించు కునే నెపంతో ఉద్యోగాలు తీసి వేశాయి. వేతనాలు తగ్గించాయి. దీంతో మధ్య తరగతి ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది. హైద‌రాబాద్‌లో ప‌ర్చేజింగ్ కెపాసిటీ త‌గ్గిపోయింద‌ని జాతీయ స్థాయి స‌ర్వేలు కూడా చెపుతున్నాయి. రిజిస్ట్రేష‌న్ల సంఖ్య అంతంత మాత్రంగా నే ఉంద‌ని ఆశాఖ అధికారులు అంటున్నారు. హైదరా బాద్ మహానగరంలో జనాభా కోటి దాటింది.

సొంత ఇండ్లు లేక అద్దె ఇళ్లలో ఉంటున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ 60 శాతం మిడిల్ క్లాస్ ప్ర‌జ‌లు జీవిస్తున్నారు. బీపీఎల్ కింద మిగిలిన వ‌ర్గాలున్నాయి. కేవ‌లం 3 శాతం మాత్ర‌మే హైక్లాస్ ప్ర‌జ‌లున్నారు. అయితే కోకాపేట‌లో జ‌రిగే నిర్మాణాలకు క‌స్ట‌మ‌ర్ ఎవ‌రు.. ఇక్క‌డ ఎవ‌రు జీవించ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌న్న‌ది వేయి డాల‌ర్ల ప్ర‌శ్న‌.

Bhola Shankar | భోళా శంక‌ర్ అట్ట‌ర్ ఫ్లాప్.. టీమిండియాదే వ‌ర‌ల్డ్ క‌ప్..!

కృత్రిమంగా ధరలు పెంచి…

కృత్రిమంగా భూముల ధ‌ర‌లు పెంచి ప్ర‌భుత్వ పెద్ద‌ల వ‌ద్ద కోల్పోయిన ఇమేజ్ సంపాదించుకోవ‌డానికే ఎక‌రం రూ. 100 కోట్లు కోట్ చేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఒక బిల్డర్ అన్నా రు. ఎకరం భూమికి కోకాపేటలో వంద కోట్లు పెట్టి కొన్న రాజ్‌పుష్ఫ సంస్థ ప్ర‌స్తుతం నార్సింగ్ మున్సిపాలిటీ ప‌రిధిలోని మంచిరేవుల లో కొత్త టోల్‌గేట్ వ‌ద్ద 40 ఎక‌రాల‌లో 40 అంత‌స్థుల‌తో ఒకే కాంపౌండ్‌లో 10 నుంచి 12 వేల మ‌ధ్య ఫ్లాట్ల నిర్మాణం చేపట్టిందని, వాటి అమ్మ‌కాలు అంతంత మాత్ర‌మేనంటున్నారు.

హైద‌రాబాద్‌లో క‌రోనా త‌రువాత రెండేళ్లుగా రియ ల్ ఎస్టేట్ వ్యాపారం డల్ గా ఉందని, అయినా అంతా బాగుంద‌నే సీన్‌ను బ‌డా రియ‌ల్ట‌ర్లు క్రియేట్ చేశారంటున్నారు.

ఇప్పటికే 100 శాతం ధరల పెరుగుదల

చ‌ద‌ర‌పు అడుగు ధ‌ర రూ.6 వేల నుంచి రూ12 వేల‌కు పెంచారు. దీంతో మ‌ధ్య త‌ర‌గ‌తి, ధ‌నిక మ‌ధ్య‌త‌గ‌ర‌తి వాళ్లు ఫ్లాట్లు కొన‌డానికి వెనుక‌డుగు వేస్తున్న పరిస్థితి ఏర్పడింది. తాజాగా కోకాపేట భూముల వేలంతో గ‌చ్చిబౌలి ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వ‌ర‌కు 111 జీవో ప‌రిధిలోని భూముల్లో కూడా బ‌డాబాబులు త‌ప్ప మిగ‌తా వాళ్లు కొనే ప‌రిస్థితి , ఇండ్లు క‌ట్టుకునే ప‌రిస్థితి లేదని భూముల వ్యాపారస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోకాపేట భూముల్లో ఎక‌రా రూ.100 కోట్ల ధర వల్ల రియ‌ల్ ఎస్టేట్ రంగానికి న‌ష్టాలు త‌ప్ప లాభాలు ఉండ‌వ‌న్న చర్చ వ్యాపార వ‌ర్గాల‌లో జ‌రుగుతున్న‌ది.

2009లోనే ….

2009లో ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ అంతా అధికంగా హోమ్ లోన్లు ఇవ్వ‌డంతో కుప్ప‌కూలింది. ఇన్‌స్టాల్ మెంట్లు న‌మ్ముకొని రుణాలు ఇచ్చిన బ్యాంకులు కుప్ప‌కూలి పోయాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎకాన‌మి దెబ్బ‌తిన్న‌ది. దీని ప్ర‌భావం దేశంలోని మెట్రో న‌గ‌రాల తో పాటు హైద‌రాబాద్‌ రియల్ఎస్టేట్ రంగంపై దాదాపు 10 ఏళ్లు పడింది. ఇప్పుడు కృత్రిమంగా క్రియేట్ చేసిన ధ‌ర‌ల‌తో రియ‌ల్ ఎస్టేట్ ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా ఉందని, ఇది మంచిది కాదని బిల్డర్స్ అసోసియేషన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Rohit Sharma | తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న రోహిత్ శ‌ర్మ‌.. మ‌రోసారి సెంచ‌రీల మోత మోగ‌నుందా..?

పౌరుల‌కు అంద‌ని ఫ‌లం

అప‌రిమిత అంత‌స్తులు క‌ట్టుకునే అవ‌కాశం ఇచ్చినందుకు భ‌వ‌న నిర్మాణ‌దారులు ఫ్లాట్లు కొనే పౌరుల‌కు ఏమైన ప్ర‌యోజ‌నం ఇస్తున్నారా అంటే అదీ లేదు. గ‌తంలో ఎక‌రం స్థ‌లంలో ల‌క్ష చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంతో ఐదంత‌స్తులు భ‌వంతి నిర్మించుకునే అవ‌కాశం ఉండేది. ఎఫ్ఎస్ఐ ఎత్తేసిన త‌ర్వాత అంత‌స్తులు పెరిగాయి. విస్తీర్ణం పెరిగింది.

ఇప్పుడ‌యితే ఏకంగా ఎక‌రం స్థ‌లంలో ఏడుల‌క్ష‌ల విస్తీర్ణంతో అనేక అంత‌స్తుల ట‌వ‌ర్లు క‌ట్టుకోవ‌చ్చున‌ట‌. అయినా సామాన్యుల‌కు ఒరిగింది ఏమీ లేదు. ఒక‌నాడు ఐదు వేల‌కు చ‌ద‌ర‌పు అడుగు అమ్మితే, ఇప్పుడు ప‌ది వేలు, ప‌న్నెండు వేలు, ప‌దిహేను వేలు, ఇంకొంద‌ర‌యితే 18 వేలు చ‌ద‌ర‌పు అడుగు చొప్పున అమ్ముతున్నారు.

ఇది ఎంత దారుణంగా ఉందంటే కోకాపేట వేలం ముందు రోజు చ‌ద‌ర‌పు అడుగు ఎనిమిది వేల రూపాయ‌లు చెప్పిన‌వాడు, మ‌రుస‌టి రోజు అడ్వాన్సు ఇవ్వ‌డానికి వెళితే విప‌రీతంగా ధ‌ర పెంచి చెప్పాడ‌ని ఒక పౌరుడు వాపోయాడు. నెల‌నెల‌కూ ధ‌ర‌లు పెంచుతూ పోవ‌డం త‌ప్ప అద‌నంగా క‌ల‌సి వ‌చ్చిన స్పేస్ విలువ‌ను వినియోగ‌దారుల‌కు పంచ‌డం అన్న‌ది లేదు. అస‌లు భ‌వ‌న నిర్మాణాలు, అమ్మ‌కాలు, ధ‌ర‌ల‌కు సంబంధించి ఎటువంటి నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ లేదు.

కోకాపేట ప్ర‌భావం న‌గ‌ర‌మంత‌టా..

కోకాపేట భూముల వేలం ముగిసిన మూడ‌వ రోజు మా ఇంటి య‌జ‌మాని ఫోను చేశాడు. అద్దెను ఈ నెల నుంచి ఐదు వేల రూపాయ‌లు పెంచుతున్న‌ట్టు చెప్పాడు. ఎందుకు అని అడిగితే అన్ని ధ‌ర‌లు పెరుగుతున్నాయి క‌దండీ త‌ప్ప‌దు పెంచాల్సిందే అన్నాడని మ‌ధురాన‌గ‌ర్‌లో ఉండే ఒక మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఉద్యోగి వాపోయారు.

కోకాపేట ధ‌ర చూసిన త‌ర్వాత అంద‌రూ లెక్క‌లు వేసుకుని మ‌రీ త‌మ భూముల ధ‌ర‌లు, త‌మ ఫ్లాట్‌ల ధ‌ర‌లు ఎలా పెరిగాయో చూసుకుని అంద‌కుండా పొంద‌కుండా మాట్లాడుతున్నార‌ని ఒక అద్దె ఇళ్లు చూపించ‌డంతోపాటు స్థ‌లాల అమ్మ‌కంలో మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేసే యువ‌కుడు చెప్పారు. కోకాపేట భూముల ధ‌ర‌లు హైద‌రాబాద్‌కు మంచి కంటే చెడు ఎక్కువ చేస్తాయ‌ని ఒక ఆర్కిటెక్ట్ అన్నారు.

Viral Photo | ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఉడుత.. భార‌త్‌లో ప్ర‌త్య‌క్షం!

అప‌రిమిత అంత‌స్తులు అన‌ర్ధం

అప‌రిమిత అంత‌స్తులు క‌ట్టుకునే అవ‌కాశం ఉండ‌డం వాంఛ‌నీయం కాద‌ని కుష్‌మాన్ వేక్ఫీల్డ్ గ‌తంలోనే అభిప్రాయ‌ప‌డింది. బెంగ‌ళూరులో 2.5 ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) ఉంటేనే నీటికొర‌త తీవ్రంగా ఉంద‌ని, ఇత‌ర మౌలిక స‌దుపాయాల‌పై కూడా అసాధార‌ణ‌మైన భారం ప‌డుతుంద‌ని ఆ సంస్థ ప్ర‌తినిధి అభిప్రాయ‌ప‌డుతున్నారు.

హైద‌రాబాద్‌లో త‌క్ష‌ణ‌మే ఎఫ్ఎస్ఐ నిబంధ‌న‌లు తీసుకురావాల‌ని నిర్మాణ రంగ‌నిపుణులు గ‌త కొన్నేళ్లుగా కోరుతున్నారు. దేశం లో ఎఫ్ఎస్ఐ నిబంధ‌న‌లు లేని ఏకైక న‌గ‌రం హైద‌రాబాదేన‌ని ఒక నిపుణుడు అన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రం చుట్టూ విస్తృత‌మైన స్థ‌లం ల‌భిస్తున్న‌ప్పుడు అప‌రిమిత అంత‌స్తులు నిర్మించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఏమిట‌ని మ‌రో నిపుణుడు ప్ర‌శ్నించారు.

Viral | తాచుపామును మింగిన చేప‌.. క్ష‌ణాల్లోనే రెండూ చ‌నిపోయాయి..

ఒక్క పార్కూ లేదు..

న్యూయార్కు వంటి మ‌హాన‌గ‌రాల్లోనూ వంద‌ల ఎక‌రాల్లో పార్కులు, బ్రీతింగ్ స్పేసెస్ ఏర్పాటు చేసి నిర్మాణాల‌ను అనుమ‌తించార‌ని, హైద‌రాబాద్‌లో మాత్రం ఒక్క పార్కునూ ఏర్పాటు చేయ‌లేద‌ని ఒక నిర్మాణ‌రంగ నిపుణుడు విమ‌ర్శించారు. సైబ‌ర్ ట‌వ‌ర్ మొద‌లు ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్ వ‌ర‌కు ఎక్క‌డా ఒక ప‌దెక‌రాల పార్కు లేద‌ని, ఇంత‌కంటే విధ్వంసం ఏముంటుంద‌ని ఆయ‌న అన్నారు.

ఉన్న స్థ‌లాల‌న్నీ అమ్మి సొమ్ము చేసుకోవ‌డంపై ఉన్న శ్ర‌ద్ధ పౌరుల భ‌విష్య‌త్తుపై లేద‌ని ఆయ‌న అన్నారు. హైటెక్ సిటీలో రెండు, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్ ల లో మూడు పార్కుల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న కోరారు. ఔట‌ర్ రింగు రోడ్డు వెంట పెంచిన వ‌నాల‌ను కూడా అభివృద్ధి పేరుతో తొల‌గిస్తున్నార‌ని, వాతావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త దెబ్బ‌తింటుంద‌ని ఆయ‌న అన్నారు.

ఎఫ్ఎస్ఐ లేని ఏకైక నగరం

దేశంలో ప్రతి నగరానికి ఎఫ్ఎస్ఐ నియమం ఉంది. ఒక్క హైదరాబాద్ కు తప్ప. 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎవరెవరికో మేలు చేయడంకోసం, ఏవేవో కారణాలు చెప్పి ఎఫ్ఎస్ఐ నియమాన్ని ఎత్తి వేశారు. అప్పటి నుంచి నగరంలో రియల్ దందా మొదలైంది. భూముల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి.

వైఎస్ హయాంలో మొదలైన ఈ విధానం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా నిరాటంకంగా ఇష్టారీతిన కొనసాగుతున్నది. అప్పటి నుంచి ఇప్పటిదాకా దానిని సమీక్షించలేదు. ముంబైలో ఎఫ్ఎస్ఐ కొన్ని ప్రాంతాల్లో 1.3, మరికొన్ని ప్రాంతాల్లో 2, 3గా ఉంది. మహారాష్ట్ర ప్రత్యేక అభివృద్ధి కాలనీల్లో మాత్రం తాజాగా ఎఫ్ఎస్ఐని 10 నుంచి 15 దాకా అనుమతించారు. బెంగళూరులో 2.5గా ఉంది. ఢిల్లీలో 1.5 నుంచి 3.5 వరకు ఉంది. చెన్నై ఎఫ్ఎస్ఐ 2గా ఉంది. జాతీయ సగటు2 నుంచి 2.5 వరకు ఉంది.

హైదరాబాద్ లో మాత్రం అటువంటి పరిమితులేవీ లేకుండా నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. హైదరాబాద్ లో రోడ్ల వెడల్పును బట్టి కొన్ని నియమాలు ఉన్నా వాటిని అమలు చేసే నాథుడు లేడు. హైదరాబాద్ లో ఎఫ్ఎస్ఐ లేక పోవడం వల్ల గతంలో 6,7 శాతం వరకు ఉన్నది , ఇప్పుడు 9 నుంచి 13 వరకు చేరింది. దీని ప్రకారం దేశ సగటులో ఒక్క గజం భూమికి 2 నుంచి 2.5 గజాల వరకు వర్టికల్ గా నిర్మాణం చేసుకోవడానికి పరిమితులు ఉండగా హైదరాబాద్ లో ఒక్క గజం భూమికి 9 నుంచి 13 గజాల వరకు వర్టికల్ గా నిర్మిస్తున్నారు.

Mahesh Babu | మెహ‌ర్ ర‌మేష్ వ‌లలో ఇరుక్కున్న చిరు.. తెలివిగా ఎస్కేప్ అయిన మ‌హేష్ బాబు

అందుకే కోకాపేటలో ఒక్క ఎకరంలో ఆరేడు లక్షల చదరపు అడుగులు వచ్చేలా 60 నుంచి 70 అంతస్థుల వరకు భవనాలు నిర్మించుకోవడానికి అవకాశం ఇవ్వనున్నారు. ఇలాంటి భారీ భవనాలతో మౌలిక సదుపాయాలు, రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ , పార్కింగ్ సమస్య తీవ్రంగా ఏర్పడే ప్రమాదముందని నిర్మాణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ధ‌ర‌ల పెరుగుద‌లపై నెటిజన్స్‌ స్పందన ఇది!

హైద‌రాబాద్‌లో భూముల ధ‌ర‌ల పెరుగుద‌లపై ఎన్‌. వెంక‌ట ర‌మ‌ణ అనే నెటిజ‌న్ స్పందిస్తూ,
తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ, సీఎం కీసీఆర్‌, కేటీఆర్ పాల‌న‌లో అభివృద్ధి చెందుతుంద‌ని అనుకున్నాను. కానీ ఏ నియ‌మ నిబంధ‌న‌లు లేకుండా అభివృద్ధి చేస్తున్నామ‌ని గొప్ప‌లు చెప్పుకుంటూ ప‌లు భ‌వ‌నాల‌ను నిర్మిస్తున్నారు. పేద ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన ఆసుప‌త్రుల విష‌యాల‌ను మాత్రం ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డంలేదు. నైతిక విలువ‌లు లేని ప్ర‌భుత్వాలు ఎప్ప‌టికీ స‌మాజానికి హానిక‌ర‌మే, అదే కోవ‌కు చెందిన‌దే బీఆరెస్ ప్ర‌భుత్వం కూడా. మ‌రో విష‌యం ఏమిటంటే కేంద్రంలో ప్ర‌ధాని, అలాగే వివిధ‌ రాష్ట్రాల్లో ముఖ్య మంత్రులు, ఐఏఎస్‌, ఐపీఎస్, ఇత‌ర మంత్రుల‌ పాత్ర ఏమాత్రం లేకుండా వారి ఇష్టాను సారంగా ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నా న్యాయ సంస్థ‌లు ఎందుకు జోక్యం చేసుకోవ‌డం లేదు అని ప్ర‌శ్నించారు.

దేశంలో అత్యంత అవినీతి క‌లిగిన మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే హైదరాబాద్ మాత్రమే. పెట్టుబ‌డి దారుల‌ను ఆకర్షిండం కోసం అప‌రిమిత‌మైన అంత‌స్తుల‌ను నిర్మించుకునే హ‌క్కులు ఇవ్వ‌డం దుర్మార్గం. ఇలాగే చేస్తూ పోతే హైద‌రాబాద్ త్వ‌ర‌లోనే అస్థ‌వ్య‌స్థ ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవ‌డం ఖాయ‌మ‌ని సీతారాం అనే పౌరుడు వ్యాఖ్యానించారు.

న‌గ‌రాల్లో ఎఫ్ఎస్ఐ, ఎఫ్ఏఆర్ నియ‌మాలు త‌ప్ప‌నిస‌రి. 2006లో పెట్టుబ‌డిదారుల‌ను ఆక‌ర్షించేందుకే అప్ప‌టి ప్ర‌భుత్వం ఈ నియ‌మాల‌ను ప‌క్క‌కు పెట్టింది. దానినే ఇప్ప‌టి ప్ర‌భుత్వం కూడా కొన‌సాగించ‌డం మంచిది కాదు అని ఒక పౌరుడు అన్నారు.

అప‌రిమిత‌మైన అంత‌స్థుల నిర్మాణం ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మే. ఇది కేవ‌లం బిల్డ‌ర్ల దురాశ అయితే అధికారుల బాధ్య‌తారహితం. వీటిని ఏదైన పెద్ద ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడే ప్ర‌భుత్వం గ్ర‌హిస్తుంది. అప్ప‌టిక‌ప్పుడు కొన్ని భ‌వ‌నాల‌ను నిర్మూలించి మ‌రో సారి జ‌ర‌గ‌వ‌ని తెలుపుతుంది. కానీ ఆ ప్ర‌మాదాల్లో మ‌ర‌ణించిన వారి సంగ‌తి మాత్రం ఎవ‌రికీ ప‌ట్ట‌దు అని జ‌గ‌న్‌మోహ‌న్ విమ‌ర్శించారు.

అప‌రిమిత‌మైన అంత‌స్థుల నిర్మాణ‌మ‌నేది చాలా పెద్ద కుంభ‌కోణం. ఏదైనా పెద్ద ప్ర‌మాదం సంభవించిన‌ ప్పుడే దీని ప్ర‌భావం ఏంటో తెలుస్తుంది. ఈ నిర్మాణాల‌న్నీ పూర్త‌యి జ‌న‌మంతా అక్క‌డ‌చేరి కోవిడ్‌కు ముందునాటి సాధార‌ణ‌ ప‌రిస్థితులు వ‌స్తేగానీ ఆ ప్రాంతం ఎంత దుర్భ‌రంగా మారుతుందో తెలియ‌దు. ఒక్క సారి గ‌నుక భారీ ప్ర‌మాదం జ‌రిగే తెలుస్తోంది. అలాగే హైద‌రాబాద్‌లో పెద్ద పెద్ద మాల్స్ వ‌ద్ద ట్రాఫిక్ జామ్ అయ్యి గంట‌ల కొద్ది అందులో ఇరుక్కుపోవ‌డానికి మూలం కూడా ఇదే అని సుశీల్‌ వ్యాఖ్యానించారు.

హైద‌రాబాద్ న‌గ‌రం డిజాస్ట‌ర్ దిశ‌గా ప్ర‌యాణిస్తోంది. ప్ర‌భుత్వం వీటి తాలూకు హెచ్చ‌రిక‌ల‌ను క‌ప్పి పెడుతోంది. కానీ చేదాటి పోయాక వీటిని అదిగ‌మించ‌డం కోసం మ‌రో కొత్త ప్రాజెక్టుల‌ను ప్ర‌వేశ పెడుతోంది. ఇదంతా కేవలం సొమ్ము చేసుకోవ‌డం కోస‌మే అని జ‌స్టిన్ అన్నారు.

Assembly Elections | ఆ అభ్యర్థుల ఎంపిక అవగాహన మేరకేనా?

Latest News