శృంగారానికి అంగీక‌రించ‌లేద‌ని.. ఇన్‌స్టా ఫ్రెండ్‌ను చంపేశాడు..

ఇన్‌స్టాగ్రాంలో వారిద్ద‌రూ ఫ్రెండ్స్‌. ఇద్ద‌రి మ‌ధ్య మంచి ప‌రిచ‌యాలు ఏర్ప‌డ‌టంతో క‌లిసి ఉండాల‌నుకున్నారు. దీంతో ఇద్ద‌రూ క‌లిసి ఒకే గ‌దిలో దిగారు

  • Publish Date - December 14, 2023 / 05:11 AM IST

భోపాల్ : వారిద్ద‌రూ ఇన్‌స్టాగ్రాంలో ఫ్రెండ్స్‌. ఇద్ద‌రి మ‌ధ్య మంచి ప‌రిచ‌యాలు ఏర్ప‌డ‌టంతో క‌లిసి ఉండాల‌నుకున్నారు. దీంతో ఇద్ద‌రూ క‌లిసి ఒకే గ‌దిలో దిగారు. ఆ త‌ర్వాత త‌న‌తో శృంగారం చేయాల‌ని ఒత్తిడి చేశాడు. యువ‌తి అంగీక‌రించ‌క‌పోవ‌డంతో క‌త్తితో పొడిచి చంపాడు.


వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గుణ జిల్లాకు చెందిన ప్ర‌వీణ్ సింగ్ ధ‌ఖ‌డ్‌(24) ఇన్‌స్టాగ్రాంలో యాక్టివ్‌గా ఉన్నాడు. ప్ర‌వీణ్‌కు ఇన్‌స్టాలోనే 20 ఏండ్ల యువ‌తి ప‌రిచ‌య‌మైంది. ఇద్ద‌రూ క‌లిసి ఉండాల‌నుకున్నారు. వారిద్ద‌రి అంగీకారంతో ఇండోర్‌లోని రావుజీ బ‌జార్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. కొద్ది రోజులుగా క‌లిసే ఉంటున్నారు. అయితే త‌న‌తో శృంగారం చేయాల‌ని యువ‌తిపై ప్ర‌వీణ్ ఒత్తిడి చేశాడు.


కానీ యువ‌తి ప్ర‌వీణ్ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించింది. శృంగారానికి అంగీక‌రించే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చిచెప్పింది. దీంతో క‌త్తితో ఆమె మెడ‌పై దాడి చేశాడు. ఈ క్ర‌మంలో తీవ్ర ర‌క్త‌స్రావం జ‌రిగి ప్రాణాలు కోల్పోయింది. అనంత‌రం ప్ర‌వీణ్ ఆ గ‌దికి బ‌య‌ట తాళం వేసి, ఆమె ఫోన్ తీసుకొని ప‌రారీ అయ్యాడు.


రెండు రోజుల త‌ర్వాత ఆ గ‌ది నుంచి దుర్వాస‌న రావ‌డంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో యువ‌తి హ‌త్య వెలుగు చూసింది. ప్ర‌వీణ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.