విధాత: పాములు చాలా డేంజరస్. అవి మనషులను కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాంటి విషపూరిత పాములతో కొందరు ఆటలాడుతూ పైశాచిక ఆనందం పొందుతుంటారు. కొందరేమో మానవతా దృక్పథంతో ఆలోచించి, పాములను కాపాడి అటవీ ప్రాంతాల్లో వదిలేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి భారీ పొడవున్న పామును పట్టుకుని దానికి సున్నితంగా ముద్దు ఇచ్చాడు. ఆ తర్వాత పాము కుబుసాన్ని కూడా తీసేశాడు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి.. నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఆరేడు అడుగుల పొడవున్న ఓ భారీ పామును ఓ వ్యక్తి పట్టుకున్నాడు. అది కోరలు చాచుతూ బుసలు కొడుతోంది. అయినప్పటికీ ఆ వ్యక్తి ఏ మాత్రం బెదరకుండా, దాని తలపై ముద్దు పెట్టాడు. అనంతరం దాని తలపై ఉన్న చర్మాన్ని నెమ్మదిగా తొలగించాడు. ఇక తల నుంచి తోక వరకు ఉన్న కుబుసాన్ని కూడా నెమ్మదిగా తీసేశాడు. ఇలా సున్నితంగా కుబుసాన్ని తీసేసిన తర్వాత థ్యాంక్స్ చెప్పినట్లుగా పాము అతడి వైపు ఓ లుక్ ఇస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం 18 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి మరి..
అయితే వివిధ కారణాల వల్ల పాములు తమ చర్మాన్ని తొలగిస్తాయి. ఈ ప్రక్రియను మోల్టింగ్ లేదా ఎక్డిసిస్ అని పిలుస్తారు. పాములు పెరిగేకొద్దీ, వాటి చర్మం దృఢంగా మారి, ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో దృఢంగా మారిన చర్మం దానంతటకు అదే వదిలిపోతోంది. లేదంటే స్నేక్ క్యాచర్స్ తొలగిస్తారు. ఇలా దృఢంగా ఏర్పడిన వదిలిన చర్మాన్ని వాడుక భాషలో కుబుసం అని పిలుస్తారు. ఇక చర్మం తొలగిపోవడం వల్ల కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది.