Site icon vidhaatha

Manala Mohan Reddy | వైఫల్యాలు వెలుగులోకి వస్తాయన్న భయంతోనే అరెస్టులు: మానాల

Manala Mohan Reddy

విధాత, నిజామాబాద్ ప్రతినిధి: బీఆరెస్ ప్రభుత్వ వైఫల్యాలు బయటపడుతాయన్న భయంతోనే ప్రజాసమస్యలపై ఉద్యమిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ శ్రేణులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించడానికి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని జిల్లాలలో రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించి వాటి స్థితిగతులను ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహేష్ కొనగల ఇంచార్జీగా రావడం జరిగిందన్నారు. 8 సంవత్సరాల క్రితం ప్రతి నియోజకవర్గంలో 5000 వరకు ఆర్భాటంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేసి, ఇప్పటివరకు ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో నిర్మించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు.

అందుకే మహేష్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలన చేపట్టడం జరిగిందన్నారు.సమావేశంలో పార్టీ నాయకులు నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు, ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హమ్ దన్ , పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, ప్రధాన కార్యదర్శి ప్రేమలత అగర్వాల్, కార్పొరేటర్ గడుగు రోహిత్, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Exit mobile version