Telangana | హీట్ పెంచనున్న సెప్టెంబర్ 17.. పోటాపోటీగా ప్రధాన పార్టీల సభలు

Telangana | విధాత: సెప్టెంబర్ 17వ తేదీ అంటే ఇప్పటిదాకా రాజకీయ పార్టీల మధ్య తెలంగాణ విమోచన దినం.. విలీన దినం..విముక్తి దినం..విద్రోహ దినం అన్న భిన్న కోణాల్లో రాజకీయ పార్టీలన్ని వేర్వేరుగా నిర్వహించే కార్యక్రమాలతో సందడితో కొనసాగే రోజు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ దఫా సెప్టెంబర్ 17కు గతంలో ఉన్న పోటాపోటీ కార్యక్రమాలకు తోడు అదనపు హంగులు తోడవుతున్నాయి. దీంతో ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల మధ్య పోటాపోటీ […]

  • Publish Date - September 6, 2023 / 01:06 PM IST

Telangana |

విధాత: సెప్టెంబర్ 17వ తేదీ అంటే ఇప్పటిదాకా రాజకీయ పార్టీల మధ్య తెలంగాణ విమోచన దినం.. విలీన దినం..విముక్తి దినం..విద్రోహ దినం అన్న భిన్న కోణాల్లో రాజకీయ పార్టీలన్ని వేర్వేరుగా నిర్వహించే కార్యక్రమాలతో సందడితో కొనసాగే రోజు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ దఫా సెప్టెంబర్ 17కు గతంలో ఉన్న పోటాపోటీ కార్యక్రమాలకు తోడు అదనపు హంగులు తోడవుతున్నాయి.

దీంతో ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల మధ్య పోటాపోటీ కార్యక్రమాల వేదికవుతుండటం విశేషం. వాటిలో ప్రధానంగా అధికార బీఆరెస్ పార్టీ నుంచి సీఎం కేసీఆర్ ఈనెల 16న పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ ప్రారంభించి కృష్ణా జలాలకు పూజలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ వివిధ స్థాయి ప్రజాప్రతినిధులను కళాశాలల్లో కృష్ణా జలాలను తీసుకెళ్లి సెప్టెంబర్ 17న ఈ పథకం పరిధిలోని జిల్లాల గ్రామాగ్రామాన ఉన్న దేవుళ్ల కాళ్లకు అభిషేకం చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

అయితే గతంలో మాదిరిగా బీఆరెస్ తెలంగాణ విలీన దినోత్సవం నిర్వహిస్తుందో లేదోనన్నదానిపై మాత్రం ఆ పార్టీ నాయకత్వం నుండి ఇప్పటికైతే స్పష్టత లేదు. బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవాలను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గతంలో మాదిరిగా అధికారికంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. పార్టీ శ్రేణులు జిల్లాల్లో తెలంగాణ విమోచన దినోత్సవాలతో సందడి చేయనున్నారు.

కాంగ్రెస్ పార్టీ సైతం సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవం పేరుతో గత ఏడాది కార్యక్రమం నిర్వహించగా ఈ దఫా కూడా నిర్వహించవచ్చు. అయితే అదే రోజున కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ తలపెట్టడంతో ఆ పార్టీ శ్రేణులు ఆ సభ నిర్వాహణలో నిమగ్నం కానున్నాయి. ఇక సీపీఐ, సీపీఎంలు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల పేరుతో తెలంగాణ విముక్తి దినోత్సవాలను నిర్వహించనున్నారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ వంటి ఎంఎల్ పార్టీలు తెలంగాణ విద్రోహ దినంగా సెప్టెంబర్ 17ను జరుపుకోనున్నాయి.

Latest News