Manchiryala | చెన్నూరు, కోటపల్లి మండ‌లాల్లోని ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలు

Manchiryala కెసిఆర్ ఎన్నికల‌ హామీ.. తమకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలని డిమాండ్ విధాత, ప్రతినిధి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో మరోసారి నిరుపేదలు తమకు వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆందోళనలకు దిగారు. ప్రభుత్వ అసైన్మెంట్ స్థలాల్లో గుడిసెలు వేసుకొని తమ పోరాటాన్ని ఉదృతం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని సుమారు వందల మంది నిరుపేదలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెన్నూర్ పట్టణ శివారులోని ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో పాగా […]

  • Publish Date - May 4, 2023 / 11:57 AM IST

Manchiryala

  • కెసిఆర్ ఎన్నికల‌ హామీ.. తమకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలని డిమాండ్

విధాత, ప్రతినిధి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో మరోసారి నిరుపేదలు తమకు వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆందోళనలకు దిగారు. ప్రభుత్వ అసైన్మెంట్ స్థలాల్లో గుడిసెలు వేసుకొని తమ పోరాటాన్ని ఉదృతం చేస్తున్నారు.

మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని సుమారు వందల మంది నిరుపేదలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెన్నూర్ పట్టణ శివారులోని ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో పాగా వేసి భష్మించుకుని కూర్చున్నారు. వీరికి సీపీఎం పార్టీ మద్దతు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు గడిచినా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకేలేదని భూమిలేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూమి ఉన్న పేదలకు ఇల్లు కట్టుకునేందుకు మూడు లక్షల రూపాయలు ఇస్తామని మాటమార్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా లాంటి సంక్షోభ సమయాల్లో పని దొరకక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, దొరికిన పనికి వచ్చిన కూలి డబ్బులు ఇళ్ల కిరాయిలు కట్టలేక పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వారు పేర్కొన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భూమిలేని పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరీ చేసి హక్కులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ హక్కులను నెరవేర్చకుండా మేము వేసుకున్న గుడిసెలు తీసేందుకు ప్రయత్నించినట్లైతే ఎంతటి ఉద్యమానికైనా వెనుకాడబోమని వారు హెచ్చరించారు.

Latest News