AP Ministers Maoist Threat| ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపులు

ఏపీ మంత్రులు కందుల దుర్గేష్ , అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్‌కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ వెలువడటం కలకలం రేపింది. మావోయిస్టుల పేరుతో పోస్ట్ ద్వారా వారి లేఖలు అందాయి. లేఖలో వారిని హతమారుస్తామంటూ మావోయిస్టులు హెచ్చరించారు.

అమరావతి:  ఏపీ మంత్రులు కందుల దుర్గేష్ , అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్‌కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ వెలువడటం కలకలం రేపింది. మావోయిస్టుల పేరుతో పోస్ట్ ద్వారా వారి లేఖలు అందాయి. లేఖలో వారిని హతమారుస్తామంటూ మావోయిస్టులు హెచ్చరించారు. అయితే ఈ బెదిరింపులు లేఖలు నిజంగానే మావోయిస్టులు విడుదల చేశారా లేక రాజకీయ ప్రత్యర్థుల కుట్రలో భాగమా అన్న అనుమానాలను బాధిత మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు ఈ బెదిరింపు లేఖల వ్యవహారంపై విచారణ ప్రారంభించారు.

తన చాంబర్ కు పంపిన మావోయిస్టుల బెదిరింపు లేఖపై మంత్రి కందుల దుర్గేష్‌ స్పందించారు. తనతో పాటు అనగాని సత్యప్రసాద్‌, రవీంద్ర, సత్యకుమార్ లకు మావోయిస్టుల పేరుతో పోస్ట్‌ ద్వారా లేఖలు వచ్చినట్లు చెప్పారు. మావోయిస్టుల పేరిట వచ్చిన ఈ లేఖలు చూసి నా కుటుంబసభ్యులు ఆందోళన చెందారు అని దుర్గేష్ తెలిపారు. వ్యక్తిగతంగా, శాఖాపరంగా ఎక్కడా ఎలాంటి తప్పులు చేయలేదని, అాలాంటప్పుడు నన్ను బెదిరించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. మావోయిస్టుల లేఖలు ఇలా ఉండవు.. ఎవరో ఉద్దేశపూర్వకంగానే బెదిరింపు లేఖలు రాసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బెదిరింపు లేఖపై మంత్రి దుర్గేష్ కార్యాలయ అధికారులు తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Latest News