Margadarsi Case | రామోజీరావుకు షాక్‌.. వెయ్యి కోట్లకు చేరిన మార్గదర్శి ఎటాచ్మెంట్స్

Margadarsi Case | గతంలో రూ. 794 కోట్లు, నేడు రూ. 242 కోట్లు విధాత: మొన్నా మధ్య చంద్రబాబు ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసి వచ్చారు.. మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద తగ్గుతుందని వార్తలు వచ్చినా అదేమీ లేనట్లే ఉంది. రామోజీ రావు విషయంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమ వ్యాపారాలను నిగ్గు తేల్చే అంశంలో ఏపీ సీఐడీ తన దూకుడు కొనసాగిస్తోంది. మార్గదర్శి చరాస్తులను గురువారం ఏపీ సీఐడీ జప్తు చేసింది. వీటి లువ […]

  • Publish Date - June 16, 2023 / 05:22 AM IST

Margadarsi Case |

  • గతంలో రూ. 794 కోట్లు, నేడు రూ. 242 కోట్లు

విధాత: మొన్నా మధ్య చంద్రబాబు ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసి వచ్చారు.. మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద తగ్గుతుందని వార్తలు వచ్చినా అదేమీ లేనట్లే ఉంది. రామోజీ రావు విషయంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమ వ్యాపారాలను నిగ్గు తేల్చే అంశంలో ఏపీ సీఐడీ తన దూకుడు కొనసాగిస్తోంది.

మార్గదర్శి చరాస్తులను గురువారం ఏపీ సీఐడీ జప్తు చేసింది. వీటి లువ రూ. 242 కోట్లు, గతంలో రూ. 794 కోట్ల చరాస్థులను ఏపీ సీఐడి అటాచ్ చేసింది. దీంతో మొత్తం ఈ జప్తుల విలువ వెయ్యి కోట్లు దాటింది. ఈ కేసులో సీఐడీ ఇప్పటికే రామోజీరావు శైలజా కిరణ్ లను పలుమార్లు విచారించింది.

చిట్ , డిపాజిట్ల డబ్బులను ఇతర వ్యాపారాలకు మళ్లించారు అనే ఆరోపణల మీద రామోజీ రావును ఏ -1 , మార్గదర్శి ఎండి శైలజ ను ఏ-2 గా పేర్కొంటూ సీఐడీ కేసులు బుక్ చేసింది. డిపాజిట్ దారుల నుంచి సేకరించిన మొత్తాలను మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులుగా పెట్టినట్లుగా సీఐడీ దర్యాప్తులో తేలింది.

కేసు విచారణ ప్రస్తుతం తెలంగాణా కోర్టులో సాగుతోంది. దాన్ని ఏపీ హై కోర్టు బదిలీ చేయాలనీ ఏపీ సీఐడీ కోర్టును కోరింది. ఇదిలా ఉండగా ఈ కేసులో మార్గదర్శి పెద్దలను అరెస్ట్ చేసే అవకాశాలూ ఉన్నాయని అంటున్నారు.