Mirai Box Office Collection : కలెక్షన్స్ లో ‘మిరాయ్‌’..రయ్…రయ్..!

‘మిరాయ్‌’ తొలి రోజు బాక్సాఫీస్‌ కలెక్షన్లలో(Mirai Box Office Collection) దూసుకెళ్లి రూ.27.20 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లోనూ మంచి స్పందన సాధించింది.

విధాత: హీరో తేజా సజ్జా(Teja Sajja) సూపర్ యోధాగా..మహావీర్‌ లామాగా మంచు మనోజ్ లు కీలక పాత్రాల్లో నటించిన తాజా చిత్రం ‘మిరాయ్‌’(Mirai) సక్సెస్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ కలెక్షన్లలోనూ(Box Office Collection) దూసుకపోతుంది. తాజాగా నిర్మాణసంస్థ మిరాయ్ సినిమా తొలి రోజు సాధించిన కలెక్షన్స్ ను అధికారికంగా వెల్లడించింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.27.20 కోట్లు వసూలుచేసినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగానే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఫాంటసీ అడ్వెంచర్‌ మూవీ ‘మిరాయ్‌’కు మంచి స్పందన లభిస్తోంది. మొదటిరోజు విదేశాల్లో రూ.7లక్షల డాలర్లు వసూలుచేసినట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది. సినిమా వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌పై నెట్టింట ప్రశంసలు వస్తున్నాయి.

మిరాయ్(Mirai) చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ లో హీరో తేజ సజ్జా స్పందిస్తూ.. ‘మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు, ఇదే మిరాయ్‌’ అని ఆనందం వ్యక్తంచేశారు. మంచు మనోజ్‌(Manchu Manoj) మాట్లాడుతూ తనను నమ్మిన దర్శక నిర్మాతలకు రుణపడి ఉంటానన్నారు. సినిమా నిర్మాత విశ్వప్రసాద్, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనిలు మిరాయ్ సక్సెస్ తో నన్ను మాత్రమే నిలబెట్టలేదు.. నాతో పాటు నా కుటుంబాన్ని కూడా నిలబెట్టారు’’ అని ఎమోషనల్ అయ్యారు. చాలా సినిమాలలో అవకాశాలు వచ్చి.. చివరి నిమిషంలో క్యాన్సిల్‌ అయ్యాయని..అలాంటి టైమ్‌లో కార్తిక్‌ నన్ను నమ్మడం నా అదృష్టం అన్నారు. గొప్ప విజయం అందుకోబోతున్న ఈ మూవీ కథలో నన్ను భాగం చేసినందుకు కార్తిక్‌కు జన్మంతా రుణపడి ఉంటానన్నారు.