విధాత: మెగా కుటుంబంలోకి మరో వారసుడు వచ్చాడు. వరుణ్ తేజ్(Varun Tej) లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) దంపతులు బుధవారం ఉదయం హైదరాబాద్ రెయిన్‌బో ఆసుపత్రిలో(Rainbow Hospital) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు వరుణ్ తేజ్-లావణ్య దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 2017లో వీరి మధ్య ఏర్పడిని స్నేహం కాస్త ప్రేమగా మారి 2023లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. లావణ్య-వరుణ్‌లు కలిసి తొలిసారిగా మిస్టర్(Mister) అనే సినిమాను చేశారు. అప్పుడే విరి మధ్య ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా సార్లు జాగ్రత్తగా ఉన్నారు. పెళ్లికి కొద్దిరోజుల ముందు అందరికి చెప్పి మెగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు మెగా కుంటుంబం నుంచి మరో వారసుడు రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.