బాలికలతో మంత్రి కరాటే విన్యాసాలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గం, చెన్నూరు హైస్కూల్లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బాలికలతో కలిసి కరాటే విన్యాసాలు చేశారు. ఈ సందర్భంగా బాలికలు త‌మ ఆత్మ రక్షణ కోసం కరాటే ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు. ప్ర‌తీ బాలిక క‌రాటే త‌ప్ప‌క నేర్చుకోవాల‌ని సూచించారు. బాలికలకు జాతీయ బాలికా దినోత్సవం […]

  • Publish Date - January 24, 2023 / 11:23 AM IST

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గం, చెన్నూరు హైస్కూల్లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బాలికలతో కలిసి కరాటే విన్యాసాలు చేశారు.

ఈ సందర్భంగా బాలికలు త‌మ ఆత్మ రక్షణ కోసం కరాటే ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు. ప్ర‌తీ బాలిక క‌రాటే త‌ప్ప‌క నేర్చుకోవాల‌ని సూచించారు. బాలికలకు జాతీయ బాలికా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

ఆడపిల్లలకు సమాజంలో సమాన అవకాశాలు, సమానత్వం, సంరక్షణ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఆడపిల్లలపై దాడులు చేసిన వారిపై, అమానుషంగా వ్యవహరించిన వారిపట్ల రాష్ట్ర ప్ర‌భుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. బాలిక‌లు, మ‌హిళ‌ల‌ రక్షణకు షి – టీమ్స్, భరోసా కేంద్రాలు, సఖీ సెంటర్లు ఏర్పాటు చేసి అండగా నిలుస్తోందని మంత్రి అన్నారు.