విధాత: జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ హరిచందనలు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 5126 దరఖాస్తులు రాగా, వాటిలో ఎక్కువగా ఇండ్లు, ఉద్యోగాల కోసం వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
కాగా ఆటో డ్రైవర్లు కూడా ప్రజాభవన్‌కు వచ్చి మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ వసతితో తమ ఉపాధికి దెబ్బ పడిందని, ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి పొన్నంకు వినతి పత్రం అందించారు. స్పందించిన పొన్నం మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు మా సోదరులేనని, కొంచం ఓపిక పట్టాలని, త్వరలోనే ఆటోయూనియన్ల నాయకులతో చర్చించి మీ సమస్యలన్ని పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.