తమ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుంది: మంత్రి సీతక్క

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలోని ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుందని మంత్రి సీతక్క అన్నారు.

  • Publish Date - December 20, 2023 / 12:36 PM IST
  • స‌చివాల‌యంలో క్రిస్మ‌స్ వేడుక‌లలో మంత్రి అనసూయ సీతక్క

విధాత‌, హైద‌రాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలోని ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుందని మంత్రి సీతక్క అన్నారు. బుధ‌వారం సచివాలయం క్రిష్టియన్ ఎంప్లాయిస్ అసోసియన్ ఆధ్వర్యంలో సచివాలయంలో ఘ‌నంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన మంత్రి సీతక్క మాట్లాడుతూ విద్య వైద్యరంగాలలో కొనియాడదగిన సేవలను క్రైస్తవులు అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో క్రైస్తవులకు రక్షణ కల్పిస్తామని, ప్రజలందరూ, శాంతి, సోదరభావంతో మెలగాలని కోరారు.


ఈ వేడుక‌ల‌కు ముఖ్య వక్తగా విచ్చేసిన ఎడ్వర్డ్ విలియమ్స్ క్రిస్ట్ మస్ కేక్ ను కట్ చేశారు. అనంతరం ఏసు ప్రభువు బోధించిన శాంతి సూత్రములను ప్రజలందరూ ఆచరించలని కోరారు. ఈ క‌ర్య‌క్ర‌మంలో ప్రోటోకాల్ డైరెక్టర్ అరవిందర్ సింగ్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి విజయకుమార్, తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయిస్ అసోసియోషన్ ప్రెసిడెంట్ లాల్ బహదూర్ శాస్త్రి, వైస్ ప్రెసిడెంట్ చిట్టిబాబు, సభ్యులు సువర్ణరాజు, శశిభూషన్, ప్రేమలీల, దేవరాజు, విక్రమ్, మనోరమ, స్వామినాథన్, వసంత్ విప్లవ్, జేకబ్ రాస్ తదితరులు పాల్గొన్నారు.