Site icon vidhaatha

House Arrest | గృహ నిర్బంధంలో MLC జీవన్ రెడ్డి, DCC అధ్యక్షుడు అడ్లూరి

House Arrest

విధాత‌: జగిత్యాల జిల్లా వెల్లటూరు మండలం పాశిగామ బాధితులతో మాట్లాడేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని జగిత్యాల టౌన్ పోలీసులు గృహ నిర్బంధం (House Arrest) లో ఉంచారు.జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మన్ కుమార్ ను సైతం ధర్మపురి పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు.

వీరితో పాటు పనులు కాంగ్రెస్ నాయకులను కూడా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా పాశిగామతో పాటు మరో ఐదు గ్రామాల ప్రజలు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ప్రజల ఆందోళనను ఏమాత్రం పట్టించుకోని అధికారులు నిర్మాణం పనుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం పనుల కోసం లారీలలో తీసుకువచ్చిన జెసిబిలను కిందకు దించకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు.

పోలీసులు ప్రజలకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా, ఫలితం లేకపోవడంతో వాటిని తిప్పి పంపారు. బుధవారం జరిగిన ఘటనల నేపథ్యంలో ఇథనాల్ బాధితులతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల నుండి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నుండి ఆ గ్రామానికి వెళ్లే ప్రయత్నం చేయగా అడ్డుకున్న పోలీసులు వారిని గృహ నిర్బంధంలో ఉంచారు.

Exit mobile version