విధాత: కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపైన, మిషన్ భగీరథ స్కీమ్‌పైన ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శాసనమండలిలో గవర్నర్ తమిళిపై ప్రసంగంపై దన్యవాద తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో జీవన్ రెడ్డి మాట్లాడారు.
సాగునీరు హక్కులు కాపడటంతో గత ప్రభుత్వం విఫలమైందన్నారు. కృష్ణానదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం అడ్డుకోవాలని, కృష్ణా జలాలలో రాష్ట్ర హక్కులను కాపడటటంతో గత ప్రభుత్వం తరహాలో ఉదాసీనత చూపరాదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలని, కేంద్రం వివక్ష వల్ల జాతీయ హోదా సాదించలేకపోయామని, ఇందుకు కావాల్సిన ప్రయత్నాలు కొనసాగించాలన్నారు.
లక్ష కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును పర్యాటక ప్రాజెక్టుగా మార్చారని విమర్శించారు. మిషభ్ భగీరథ కమిషన్ల కోసమే తెచ్చారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుతో తలెత్తిన మరమ్మతులను ప్రభుత్వంపై భారం పడకుండా గుత్తేదారుతోనే జరిపించాలని కోరారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును బీఆరెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్రం ఆరోపిస్తుందని, ప్రభుత్వం దీనిపై చొరవ తీసుకోవాలన్నారు.
గత ప్రభుత్వ నిర్వాకంతో విద్యుత్తు సంస్థలు 80వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయని, అన్ని వసతులు ఉన్న రామగుండం కాదని యాదాద్రిలో పవర్ ప్లాంట్ పెట్టడం ద్వారా అనవసర వ్యయం పెంచారన్నారు. ఈ రకమైన అసంబద్ధ విధానాలతో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నా