విధాత బ్యూరో, కరీంనగర్: ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (MLC Kaushik Reddy) వాహనానికి ప్రమాదం జరిగింది. కారులో బెలూన్స్ ఓపెన్ కావడంతో ముప్పు తప్పింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. 2కే రన్‌కు హాజరయ్యేందుకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సోమవారం హైదరాబాద్ నుండి హూజూరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
ఎదురుగా ఉన్న టూవీలర్‌ను తప్పించబోయి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనం పొలాల్లోకి దూసుకెళ్లి ఓ చెట్టును ఢీకొట్టింది. బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ముప్పు తప్పగా.. ఊపిరి పీల్చుకున్న కౌశిక్ ఆ తర్వాత తన ఎస్కార్ట్ వెహికిల్ ఎక్కి హుజూరాబాద్ వెళ్లిపోయారు. అయితే, ఎదురుగా బైక్ పై ఉన్న వ్యక్తికి గాయాలు కాగా.. అతణ్ని ఆసుపత్రికి తరలించారు.