విధాత,హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు ఏడున్నర గంటల ఎమ్మెల్సీని సీబీఐ అధికారులు విచారించారు. సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద నోటిసు ఇచ్చిన అధికారులు.. విచారణ కోసం ఆదివారం ఉదయం 10.50గంటల ప్రాంతంలో బంజారాహిల్స్‌లోని కవిత ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే.
రాఘవేంద్ర వస్త నేతృత్వంలో అధికారుల బృందం ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. బృందంలో ఓ మహిళా అధికారి సైతం ఉన్నారు. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సాయంత్రం 6.30 గంటల వరకు అధికారులు ఎమ్మెల్సీని ప్రశ్నించారు. కేసులో అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉండడంతో 160 సీఆర్పీసీ కింద సీబీఐ అధికారులు కవితను విచారించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం: MLC కవిత విచారణ..! ఇంకా ముగియలే.. ముందుంది ముసళ్ల పండుగ?
స్కామ్‌కు సంబంధించి రూ.100 కోట్ల ముడుపులు తరలింపులో కవిత భాగస్వామిగా వ్యవహరించారని, అలాగే కవిత పది ఫోన్లు మార్చడంతో పాటు ధ్వంసం చేసినట్లు కవితపై ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన సీబీఐ, వారి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా కవితను విచారించింది. దాదాపు ఏడున్నర గంటల తర్వాత సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. సీబీఐ కవితను విచారించిన నేపథ్యంలో కవిత ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. ఆరు గంటలుగా కవితను విచారిస్తున్న సీబీఐ