Viral News | సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్న సమయంలో భారీ శబ్దంతో చేతిలోనే బ్లాస్ట్ అయ్యింది. ఈ ఘటనలో 13 సంవత్సరాల బాలుడు తీవ్ర గాయాలకు గుయ్యాడు. వెంటనే గమనించిన కుటుంబీకులు అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్నది.
వివరాళ్లోకి వెళితే.. మధుర మేవతి మొహల్ల ప్రాంతంలో జావేద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతని కొడుకు జునైద్ (13) ఓ గదిలో ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటున్న క్రమంలోనే చేతిలో మొబైల్ ఫోన్ బ్లాస్ట్ అయ్యింది. ఒక్కసారిగా గదిలో నుంచి భారీ శబ్దం రావడంతో కుటుంబీకులు ఆందోళనకు గురై గదిలోకి వచ్చి చూడగా.. జునైద్ గాయాలతో కనిపించాడు.
వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఛాతి భాగంలో తీవ్రంగా గాయాలయ్యాయని, వెంట్రుకలు సైతం కాలి పోయాయని బాలుడి తండ్రి జావేద్ తెలిపాడు. గేమ్స్ ఆడుతుండగానే సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలి పోయిందని చెప్పాడు. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగ్గానే ఉందని పేర్కొన్నాడు. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారని జునైద్ తెలిపాడు.