KCR జన బలానికి.. మోడీ ఒక లెక్క కాదు: మంత్రి జగదీష్‌రెడ్డి

విధాత: కేసీఆర్‌కు ఉన్న జన బలం ముందు ప్రధాని నరేంద్రమోడీ లెక్క కాదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో ఈ నెల 18న జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగలి ఫంక్షన్ హాల్లో శుక్ర‌వారం నిర్వ‌హించిన సూర్యాపేట నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపైన, బీజేపీ పైన నిప్పులు చెరిగారు. దేశంలో కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నది. మొట్ట మొదటగా […]

  • Publish Date - January 13, 2023 / 03:26 PM IST

విధాత: కేసీఆర్‌కు ఉన్న జన బలం ముందు ప్రధాని నరేంద్రమోడీ లెక్క కాదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో ఈ నెల 18న జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగలి ఫంక్షన్ హాల్లో శుక్ర‌వారం నిర్వ‌హించిన సూర్యాపేట నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపైన, బీజేపీ పైన నిప్పులు చెరిగారు.

దేశంలో కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నది. మొట్ట మొదటగా ఆంధ్రప్రదేశ్ ప్రజలే అని జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ 8ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి అక్కడి ప్రజలే కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. చేయాలనే చిత్తశుద్ది ఉంటే అభివృద్ధి కి 5ఏళ్ల సమయం చాలు అని దేశ ప్రజలకు నిరూపించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.

తెలంగాణలో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ , వంటి పథకాలతో తెలంగాణ వెలుగులు కర్ణాటక, మహా రాష్ట్రను దాటి గుజరాత్ ను తాకాయి అని మంత్రి అన్నారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ పథకాల గురించే రైతులు, బడుగు బలహీనర్గాల ప్రజలు చర్చించుకుంటున్న నేపథ్యం లో కేసీఆర్ కు వస్తున్న మంచి పేరు సహించలేక నే మోడీ- షా కుట్రలు పన్నుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి మండి పడ్డారు.

కేసీఆర్ పై ఉన్న కోపం తోనే తెలంగాణకు మోడీ అన్యాయం చేస్తున్నారన్నారు. దేశచరిత్ర లో మోడీ వంటి దేశ ద్రోహ పూరితమైన ప్రభుత్వం ఏనాడూ లేదని నిప్పులు చెరిగారు. పరిపాలనలో తనను తాను నిరూపించుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్ మాత్రమే అని అన్నారు. 25ఏళ్ల డబుల్ ఇంజిన్ పాలనలో గుజరాత్ ప్రజలకు, 9ఏళ్ల వాళ్ళ పాలనలో దేశ ప్రజలకు ఒరిగింది ఏమి లేదన్నారు.

అదానీ, అంబానీల కోసమే డబుల్ ఇంజిన్ సర్కార్ లు పనిచేస్తున్నాయన్న మంత్రి కేసీఆర్ కు ఉన్న జన బలం క్రింద మోడీ లెక్క కాదని ఎద్దేవా చేశారు. యావత్ భారత దేశ రైతాంగం కేసీఆర్ పథకాల గురించే మాట్లాడుకుంటున్నాయని అన్నారు.

ఖమ్మం లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభతో దేశ వ్యాప్తంగా కేసీఆర్ మ్యానియా పెరగడం ఖాయం అన్న మంత్రి
ఖమ్మం సభకు తరలి వచ్చి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు.

సమావేశం లో ఎంపి బడుగుల, బి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయాల‌ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమళ్లా అన్నపూర్ణ, జడ్పీటీసీ లు, ఎంపీపీలు, మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు, పిఏసీఎస్ చైర్మన్ లు, బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు త‌దిత‌రులు పాల్గొన్నారు.