Mohanbabu | కలెక్షన్ కింగ్ సౌండ్ లేదేం..? రజనీని తిట్టినా మోహన్ బాబు ఎక్కడా అలికిడి లేదు

Mohanbabu విధాత‌: ఏమిటో… ప్రపంచంలోని చాలా అంశాల మీద మాట్లాడే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాత్రం ఈమధ్య సైలెంట్ గా ఉండిపోయారు. తన ఆత్మీయుడు, ఫ్రెండ్ అయిన రజనీకాంత్ ను వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్ళు తిడుతున్నా గమ్మున ఉండిపోయారు తప్ప కనీసం స్పందించలేదు. అసలు ఏమైందంటే ఎన్టీయార్ శత జయంతి సభకు వచ్చిన రజనీ కాంత్ ఎన్టీయార్ తో బాటు చంద్రబాబును సైతం పొగిడేశారు. చంద్రబాబును విజనరీగా… హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన మహా మేధావిగా కీర్తిస్తూ […]

  • Publish Date - May 4, 2023 / 03:56 AM IST

Mohanbabu

విధాత‌: ఏమిటో… ప్రపంచంలోని చాలా అంశాల మీద మాట్లాడే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాత్రం ఈమధ్య సైలెంట్ గా ఉండిపోయారు. తన ఆత్మీయుడు, ఫ్రెండ్ అయిన రజనీకాంత్ ను వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్ళు తిడుతున్నా గమ్మున ఉండిపోయారు తప్ప కనీసం స్పందించలేదు.

అసలు ఏమైందంటే ఎన్టీయార్ శత జయంతి సభకు వచ్చిన రజనీ కాంత్ ఎన్టీయార్ తో బాటు చంద్రబాబును సైతం పొగిడేశారు. చంద్రబాబును విజనరీగా… హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన మహా మేధావిగా కీర్తిస్తూ రజనీకాంత్ చేసిన ప్రసంగానికి టిడిపి పొంగిపోయింది.. టీడీపీ మద్దతుగా ఉండే మీడియా సంస్థలు రజనీ ప్రసంగాన్ని పతాక స్థాయిలో ప్రచురించాయి. ఇది వైసిపి సోషల్ మీడియాకు మింగుడు పడలేదు.

రజనీ వస్తే వచ్చాడు.. పొగిడితే ఎన్టీయారును పొగిడాడు.. కానీ మధ్యలో చంద్రబాబును మెచ్చడం… మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలని కోరడం ఏమిటన్న కోపం వైసిపి సోషల్ మీడియాలో పెల్లుబికింది. దీంతో వాళ్ళు మీమ్స్, రీల్స్ అంటూ ఫుటేజీ డంప్ చేసారు.

అసలు చంద్రబాబు ఆనాడు ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడుస్తుంటే పక్కనే ఉండి సపోర్ట్ చేసిన రజనీ ఇప్పుడు వచ్చి ఎన్టీయార్ ను గుర్తుచేసుకోవడం ఏమిటి.. ఆనాడు చంద్రబాబుకు సపోర్ట్ చేసి ఇప్పుడొచ్చి మళ్ళీ ఆ ఇద్దర్నీ పొగడడం ఏమిటన్న కోపంతో వైసిపి సోషల్ మీడియా రజనీ మీద వార్ స్టార్ట్ చేసింది.

రకరకాలుగా ఫోటోలు, 1995 నాటి ఫొటోలతో సహా విడుదల చేసి మరీ రజనీ మీద దుమ్ముపోసాయి. అంతే కాకుండా రజనీ కుటుంబ సభ్యులు.. భార్య, లత, కూతుళ్లను సైతం తమ షార్ట్స్, మీమ్స్ లో భాగం చేసి తమ అక్కసు తీర్చుకున్నారు. ఇది ఓకే కానీ ఇంత జరుగుతున్నా రజనీకి అత్యంత ఆత్మీయుడు, సన్నిహితుడు, ఒరేయ్ అని పిలిచే చనువు ఉన్న మోహన్ బాబు మాత్రం ఈ వివాదం మీద ఎక్కడా కిక్కురుమనలేదు.

అటు చంద్రబాబు, రజనీలను సపోర్ట్ చేయలేదు.. ఇటు వైసిపి వాళ్ళు చేస్తున్న సైబర్ ఎటాక్ తప్పు అని చెప్పలేదు. చెప్పలేకపోయారు.. ఎందుకంటే ఎంత కాదనుకున్నా ముఖ్యమంత్రి తనకు బంధువు.. ఆలా కాకున్నా ఈ రొచ్చులో దూరితే తనకు సైతం మకిలి అంటుతుందని భయపడ్డారా… లేక ఎందుకొచ్చిన గొడవ అని ఊరుకున్నారో తెలీదు కానీ ఈ అంశంలో మోహన్ బాబు సైలెంట్ అవ్వడం ర‌జ‌నీ ఫాన్స్, ఇంకా టిడిపి వాళ్ళను కాస్త ఆశ్చర్యపరిచింది.