MBBS ప్ర‌వేశాల‌కు మాప్ అప్ నోటిఫికేష‌న్ జారీ

ఈ నెల 13, 14వ తేదీలలో వెబ్ ఆప్షన్లు యాజమాన్య కోటా సీట్లకు మాప్ అప్ నోటిఫికేషన్ విడుదల విధాత, వరంగల్: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఈ నెల 13, 14వ తేదీలలో వెబ్ కౌన్సిలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయ‌ణ‌రావు ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యం నేడు మాప్ అప్ నోటిఫికేషన్‌ను సోమవారం విడుద‌ల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఏంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లకు ఇప్పటికే రెండు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. యాజమాన్యకోటలో […]

  • Publish Date - December 12, 2022 / 05:12 PM IST
  • ఈ నెల 13, 14వ తేదీలలో వెబ్ ఆప్షన్లు
  • యాజమాన్య కోటా సీట్లకు మాప్ అప్ నోటిఫికేషన్ విడుదల

విధాత, వరంగల్: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఈ నెల 13, 14వ తేదీలలో వెబ్ కౌన్సిలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయ‌ణ‌రావు ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యం నేడు మాప్ అప్ నోటిఫికేషన్‌ను సోమవారం విడుద‌ల చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఏంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లకు ఇప్పటికే రెండు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. యాజమాన్యకోటలో మిగిలిపోయిన ఖాళీలను ఈ మాప్ అప్ రౌండ్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ నెల 13వ తేదీన మధ్యాహ్నం 2 గంట‌ల నుంచి 14వ తేదీ మధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు వెబ్ ఆఫ్ష‌న్లును నమోదు చేసుకోవాలి. అర్హత, నిబంధనలు ఇత‌ర వివ‌రాల‌ కోసం http://www.knruhs.telangana.gov.in వెబ్ సైట్లో సంప్ర‌దించాల‌ని యూనివ‌ర్సిటీ వ‌ర్గాలు సూచించాయి.