విధాత: తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని గురువారం కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
తిరుమల శ్రీవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై ఎల్లపుడూ ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. అలాగే ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని వేడుకున్నట్టు పేర్కొన్నారు.