Mumbai | ఓ ప్రయాణికుడి పట్ల ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆటో కిరాయి చెల్లించలేదని ప్రయాణికుడితో అసహజ శృంగారం చేశాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో వెలుగు చూసింది.
ముంబైలోని ఘట్‌కోపర్ ఏరియాలో ఓ 31 ఏండ్ల వ్యక్తి పీకల దాకా మద్యం సేవించాడు. ఆటో కోసం ఎదురుచూస్తున్నాడు. అంతలోనే ఆటో వచ్చింది. ఇక ఆటో డ్రైవర్.. ప్రయాణికుడు అడ్రస్‌కు తీసుకెళ్లాడు. కిరాయి రూ. 250 అయింది. కానీ ప్రయాణికుడు కేవలం రూ. 100 మాత్రమే చెల్లించాడు.
దీంతో మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడిని డ్రైవర్ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ అతనితో డ్రైవర్ అసహజ శృంగారం చేశాడు. అంతేకాకుండా ప్రయాణికుడిని ఓ ఏటీఎం సెంటర్‌కు తీసుకెళ్లి.. రూ. 200 వసూలు చేశాడు. అనంతరం అతని ఏటీఎం కార్డు, మొబైల్ ఫోన్ తీసుకుని డ్రైవర్ వెళ్లిపోయాడు.
మద్యం మత్తు నుంచి తేరుకున్న ప్రయాణికుడు.. మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆటో డ్రైవర్ నుంచి తన ఫోన్ ఇప్పించాలని బాధితుడు పోలీసులను వేడుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.