Virosh | పెళ్లిలో రాజ‌కుమారుడిలా విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. వెడ్డింగ్ డ్రెస్సుల స్పెషాలిటీ ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

Virosh | టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక మంధాన వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అట్ట‌హాసంగా జ‌రిగింది. రాజస్థాన్‌లోని ప్ర‌ముఖ రిసార్ట్ ఐటీసీ మెమెంటోస్ వేదికగా అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది .

Virosh | టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక మంధాన వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అట్ట‌హాసంగా జ‌రిగింది. రాజస్థాన్‌లోని ప్ర‌ముఖ రిసార్ట్ ఐటీసీ మెమెంటోస్ వేదికగా అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది . కేవ‌లం స‌న్నిహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు మాత్రమే వారి వివాహ వేడుక‌కి హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది. ఇక పెళ్లి త‌ర్వాత ఈ జంట తమ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్న ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. పెళ్లి వేడుకలో వారి సంప్రదాయ దుస్తులు, ఆభరణాలు, ఆహార్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అనామిక ఖన్నా డిజైన్స్‌లో మెరిసిన జంట

ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ అనామిక ఖ‌న్నా Anamika Khanna ఈ జంట కోసం ప్రత్యేకంగా వెడ్డింగ్ అవుట్‌ఫిట్స్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగు, కొడవ సంప్రదాయాల కలయికగా ఈ వేడుక సాగినట్లు ఫోటోలు సూచిస్తున్నాయి.

ఓరియంటల్ యువరాణిలా రష్మిక

29 ఏళ్ల రష్మిక తన పెళ్లి రోజున ఆరెంజ్-గోల్డ్ కాంబినేషన్‌లోని బనారసీ సిల్క్ శారీలో అందంగా మెరిసిపోయారు. చీరపై గోల్డ్ బ్రోకేడ్ ఎంబ్రాయిడరీ, సాంప్రదాయ మోటిఫ్స్ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.

బ్లౌజ్ & దుపట్టా: చీరకు సరిపోయే హాఫ్ స్లీవ్స్ సిల్క్ బ్లౌజ్, తలపై లేత బీజ్ రంగు దుపట్టా ఆమె లుక్‌కు క్లాసిక్ టచ్ ఇచ్చాయి.

ఆభరణాలు: టెంపుల్ జ్యువెలరీ ఈ లుక్‌కు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. హెవీ చోకర్, మామిడి పిందెల హారం, కాసుల పేరు, బాజూబంద్, కడాలు అన్నీ కలిపి తెలుగు వధువులా ఆమెను అందంగా తీర్చిదిద్దాయి.

మేకప్ & హెయిర్: సాఫ్ట్ మేకప్‌తో సహజమైన గ్లోను ఎంచుకున్న రష్మిక, వదులుగా వదిలిన జుట్టును పూలతో అలంకరించడం ద్వారా సంప్రదాయ శోభను మరింత పెంచారు.

సాంప్రదాయ ధోతీలో విజయ్ రాజసం

36 ఏళ్ల విజయ్ దేవరకొండ పూర్తిగా సంప్రదాయ లుక్‌ను ఎంచుకున్నారు. ఐవరీ సిల్క్ ధోతీకి జతగా కుంకుమ రంగు అంగవస్త్రం ధరించారు. అంగవస్త్ర అంచులపై టెంపుల్ మోటిఫ్స్ ఎంబ్రాయిడరీ చేయడం ప్రత్యేకంగా కనిపించింది.

జ్యువెలరీ: పొడవాటి గోల్డ్ నెక్లెస్, బంగారు పోగులు, చేతులకు కడాలు, నడుముకు కమర్‌బంద్ ధరించి అచ్చమైన తెలుగు వరుడిలా కనిపించారు.

పారాణి ప్రత్యేకత: ముఖ్యంగా అరచేతులు, పాదాలకు పారాణి (ఆల్తా) పెట్టుకోవడం సంప్రదాయ మూలాలను గుర్తు చేస్తూ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సంస్కృతుల సమ్మేళనం

తెలుగు , కొడవ సంప్రదాయాల మేళవింపుగా జరిగినట్లు కనిపిస్తున్న ఈ వేడుకలో దుస్తులు, ఆభరణాలు, వేదిక అలంకరణ అన్నీ కలిపి రాజసంగా మార్చాయి. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Latest News