Munugode by poll | నల్లగొండ జిల్లాలోని మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు.
అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించారు. బరిలో ఉన్న 47 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. 2.41 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,21,720 మంది పురుష, 1,20,128 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్కు 5,500 మంది సిబ్బందిని ఉపయోగిస్తున్నారు. 3 వేల మందికి పైగా రాష్ట్ర బలగాలు, 15 కంపెనీల కేంద్ర బలగాలు భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ క్యాస్టింగ్ చేయడంతో పాటు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 35 శాతం ఈవీఎంలను అదనంగా సిద్ధం ఉంచగా.. సాంకేతిక లోపాలు తలెత్తితే.. సరిచేయడానికి 28 మంది ఇంజినీర్లను నియమించారు. నియోజకవర్గంలో మొత్తం 199 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు.
ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. నవంబర్ 6వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక అటు అధికార పార్టీ టీఆర్ఎస్ కు, ఇటు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది.
మునుగోడులో గతంలో ఉన్న ఓట్లు, నమోదైన ఓట్లు, పోలింగ్ శాతం వివరాలు
2004 ఎన్నికలు.. మొత్తం ఓటర్లు – 166552
నమోదైన ఓట్లు – 145431.. శాతం – 87.31
2009 ఎన్నికలు.. మొత్తం 2, 12,869
నమోదైన ఓట్లు 1,64231.. నమోదైన ఓట్ల శాతం 71.15
2014 ఎన్నికలు. మొత్తం ఓట్లు 2,09,092
నమోదైన ఓట్లు 1,71,786.. నమోదైన ఓట్ల శాతం 82.15
2018 ఎన్నికలు.. మొత్తం ఓట్లు 217760
నమోదైన ఓట్లు 198849.. నమోదైన ఓట్ల శాతం 91.31
2022 ఉప ఎన్నికలు.. మొత్తం ఓట్లు 241805..
ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల
ఈరోజు మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా..నియోజకవర్గం పరిధిలోని సంస్థాన్ నారాయణపురం మండలం, లింగవారిగూడెం గ్రామంలో టీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటల సమయంలో సతీమణితో కలిసి, ఆయన ఓటు వేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందని, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు సైతం ఓటర్లు ఉత్సాహంగా మునుగోడు వచ్చి ఓటింగ్ లో పాల్గొంటున్నారని చెప్పారు.
ఓటేసిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు #MunugodeBypoll #MunugodeWithTRS #MunugoduBypoll #MunugoduWithBJP #MunugodeWithCongress #MunugodeBypolls pic.twitter.com/ifI5bgB3gb
— vidhaathanews (@vidhaathanews) November 3, 2022
ఇడికూడలో కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి
చండూరు మండలం ఇడికూడలోని పోలింగ్ కేంద్రం 173లో కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మధ్యాహ్నం 3 PM వరకు మునుగొడు అసెంబ్లీ నియోజక వర్గ పోలింగ్ 59.92 %గా నమోదైంది.
మునుగోడు ఉప ఎన్నికపై ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కామెంట్స్..
ఉదయం 11 గం. ల వరకు 25.8 శాతం పోలింగ్.
మునుగోడు ఉప ఎన్నికల్లో 3 చోట్ల ఈవీఎంలు, 2 చోట్ల వీవీ ప్యాట్ల సమస్య తలెత్తింది. వెంటనే పరిష్కరించాం.
ఈవీఎం సమస్యతో ఒకచోట పోలింగ్ 45 నిమిషాలు ఆలస్యం అయింది.
మర్రిగూడలో పోలింగ్ కేంద్రానికి సమీపంలో చిన్నగొడవ జరిగింది.
ఇరు వర్గాలను చెదరగొట్టి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఫిర్యాదుల రూపంలో ఇవాళ 38 కాల్స్ వచ్చాయి.
42 మంది స్థానికేతరులను బయటికి పంపించాం.
రెండు చోట్ల ₹ 2.99 లక్షల నగదు పట్టుకున్నాం.
గతంలో మాదిరిగా పోలింగ్ 90% దాటుతుందని అనుకుంటున్నాం.
POLL PERCENTAGE AT 5.00 PM,
1) Total Votes: 241805.
2) No.of votes polled: 187527
3) Polling Percentage:77.55%..