Site icon vidhaatha

Jagga Reddy | రాహుల్‌తోనే నా రాజకీయ ప్రయాణం.. పార్టీ మార్పుపై విష ప్రచారం: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Jagga Reddy |

విధాత,మెదక్ ప్రత్యేక ప్రతినిధి: నా రాజకీయ జీవితం రాహుల్ గాంధీ తోనే ఉంటుందని పీసీసీ అసోసియేట్ అధ్యక్షుడు, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ లోని పీసీసీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. పార్టీ మార్పుపై వివరణ ఇచ్చారు.

ఏడాదిన్నర కాలంగా తనపై సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కావాలనే రచ్చ చేస్తున్నారని, ఇలా ప్రచారం చేస్తున్నందుకు మీకు డబ్బులు ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించారు. నా రాజకీయ జీవితంతో ఆడా లనుకుంటున్నారని, ఎవరైనా నా వ్యక్తిగత, రాజకీయ విషయాలు మాట్లాడితే నడిరోడ్డుపై నిలదీస్తానని హెచ్చరించారు.

Exit mobile version