Site icon vidhaatha

Nalgonda: రైతు సమస్యలపై ‘దుబ్బాక’ సమరం.. కలెక్టర్‌కు వినతి

విధాత: ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టిపిసిసి ప్రతినిధి దుబ్బాక నరసింహారెడ్డి నల్గొండ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఏవో కి దుబ్బాక బృందం వినతి పత్రం అందజేసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా దుబ్బాక నరసింహారెడ్డి మాట్లాడుతూ రైతుల ధాన్యం కొనుగోలుపై సరైన స్పష్టత ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 10 వ తేదీన కలెక్టరేట్ ఎదుట రైతుల పక్షాన పోరాటానికి సిద్ధమవుతామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పున్న కైలాష్ నేత, బొంత వెంకటయ్య, జిల్లపల్లి పరమేష్, అల్లి సుభాష్ యాదవ్, జాన్ రెడ్డి, సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి, మర్రి మదన్, అదిమల్ల శంకర్, సురెడ్డి సరస్వతి, గౌతమ్, చంద్రశేఖర్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version