Site icon vidhaatha

Nalgonda: పిల్లి దాతృత్వ ప్రవాహం..! కబడ్డీ జాతీయ క్రీడాకారిణికి చేయూత!!

విధాత: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ఎస్ నేత పిల్లి రామరాజు యాదవ్ నియోజకవర్గ ప్రజలకు ఆర్కేఎస్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సహాయాలు జనంలో నిత్య చర్చను రగిలిస్తూ సాగుతున్నాయి. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి పోటీగా బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న రామరాజ యాదవ్ నిత్యం లక్షల రూపాయలు వెచ్చిస్తూ సాగిస్తున్న సహాయాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.

గురువారం నల్గొండ పట్టణానికి చెందిన కందికొండ కరుణాకర్ – సరితల కూతురు, జాతీయ కబడ్డీ క్రీడాకారిణి యామినికి అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు వెళ్లేందుకు కావాల్సిన ఆర్థిక సహాయం అందించారు. గోవాలో జరిగే కబడ్డీ పోటీలకు పాల్గొనడానికి వెళ్తున్న యామిని ఇంటికి వెళ్లి ఆమెని శాలువాతో ఘనంగా సత్కరించి ప్రయాణ ఖర్చులకు ఆర్థిక సహాయం అందజేశారు. అంతకుముందు నేపాల్ లో జరిగిన అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు వెళ్లేందుకు కూడా యామినికి రామరాజు ఆర్థిక సాయం అందించగా, నిరుపేద కుటుంబానికి చెందిన యామిని ఆ పోటీల్లో విశేష ప్రతిభ చూపింది.

ఇదే రోజు రామరాజు నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించే గంగాదేవమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి 1లక్ష 10,116 రూపాయల ఆర్థిక సహాయం, నల్గొండ మున్సిపాలిటీ 14 వార్డ్ మర్రిగూడెంకి చెందిన వంగూరి అంజమ్మ కుటుంబానికి 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి తన నిరంతర దాతృత్వాన్ని చాటుకోవడం జనం మన్ననలు అందుకుంది.

Exit mobile version