Site icon vidhaatha

Balakrishna | అవార్డులు.. తెలుగు వారికే గర్వకారణం: నందమూరి బాలకృష్ణ

Balakrishna |

విధాత: తెలుగు చలన చిత్ర చరిత్రలో మొట్ట మొదటి సారిగా అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటునిగా అవార్డు దక్కడం నటునిగా ఎంతో గర్వపడుతున్నానని, తెలుగు వారికే గర్వకారణమని నందమూరి బాలకృష్ణ అన్నారు.

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్, ఆంకాలజీ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా రెండు రోజుల పాటు అడ్వాన్స్డ్ ఆంకాలజీ నర్సింగ్ సింపోజియంను బాలకృష్ణ ప్రారంభించారు.

అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ, తెలుగు సినిమా సత్తా దేశ విదేశాలలో చాటామని, విదేశీయులు కూడా తెలుగు సినిమా చూసే స్థాయికి మన చలన చిత్ర పరిశ్రమ చేరుకోవడం సంతోషకరమైన అంశమన్నారు.

పుష్పతో పాటు ఆర్ఆర్ఆర్, ఉప్పెన సినిమాలకు కూడా పలు అవార్ఢులు దక్కడం తెలుగు వారికే గర్వకారణమని చెప్పారు. ఇలా అవార్డుల వర్షం కురిపించిన స్ఫూర్తితో తెలుగు సినిమా పని చేయాలని సూచించారు.

Exit mobile version