Site icon vidhaatha

తెలంగాణ ప్ర‌భుత్వానికి జాతీయ హ‌రిత ట్రెబ్యున‌ల్ జ‌రిమానా

విధాత: తెలంగాణ ప్ర‌భుత్వానికి జాతీయ హ‌రిత ట్రెబ్యున‌ల్ జ‌రిమానా విధించింది. వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌లో మార్గ‌ద‌ర్శ‌కాలు, తీర్పులు అమ‌లు చేయ‌క‌పోవ‌డంపై ఎన్జీటీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తెలంగాణ‌కు రూ. 3,800 కోట్ల జ‌రిమానా విధించింది. 2 నెల‌ల్లో రూ 3,800 కోట్లు ప్ర‌త్యేక ఖాతాలో డిపాజిట్ చేయాల‌ని ఆదేశించింది. వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టి పురోగ‌తి చెప్పాల‌ని ఆదేశించింది.

ప‌ర్యావ‌ర‌ణ సుర‌క్షా స్వ‌చ్ఛంద సంస్థ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ సంద‌ర్భంగా ఎన్జీటీ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చింది. 1996లో మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య‌, వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ స‌రిగా లేద‌ని సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ పిటిష‌న్‌ను 2014లో ఎన్జీటీకి బ‌దిలీ చేసింది. 351 న‌దీ ప‌రీవాహ‌క ప్రాంతాలు, 124 న‌గ‌రాల్లో గాలి కాలుష్య నివార‌ణ‌పై పిటిష‌న్ వేసింది.

100 కాలుష్య కార‌క పారిశ్రామిక ప్రాంతాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అక్ర‌మ ఇసుక మైనింగ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పిటిష‌న్‌లో పేర్కొన్న‌ది. ఘ‌న‌, ద్ర‌వ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌పై ఎన్జీటీ విచార‌ణ చేప‌ట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు ఎన్జీటీ అన్ని రాష్ట్రాల‌కు నోటీసులు ఇచ్చింది.

ఆయా రాష్ట్రాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల నుంచి వివ‌ర‌ణ కోరింది. తెలంగాణ సీఎస్‌ను కూడా హ‌రిత ట్రెబ్యున‌ల్ విచారించింది. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఇచ్చిన వివ‌ర‌ణ‌పై ఎన్జీటీ సంతృప్తి చెంద‌లేదు. అందుకు అనుగుణంగా జ‌రిమానా విధిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది.

Exit mobile version