విధాత: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా జరుగుతున్నది. రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ వెంట నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ..కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ రుణమాఫీని అమలు చేస్తామన్నారు. దేశమంతా ఒకే జీఎస్టీ ఉండేలా జీఎస్టీ చట్టంలో మార్పు తీసుకొస్తామని తెలిపారు.
‘भारत जोड़ो यात्रा’ इस समय पूरे देश में चर्चा का विषय बनी हुई है। इसी दौरान तेलंगाना में राहुल गांधी ने स्थानीय बुनकरों, किसानों और आदिवासियों से बात की और उनकी समस्याओं को समझा।#BharatJodoYatra pic.twitter.com/BjS3f7Bl36
— Bharat Jodo (@bharatjodo) October 28, 2022
కేంద్రం తెచ్చిన జీఎస్టీ విధానం చిన్న, మధ్య తరహా వ్యాపారులను సంక్షోభంలోకి నెట్టింది. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ధరణితో జరిగే తప్పులను సరిచేస్తామన్నారు. నేతన్నలు జీఎస్టీతో నష్టపోతున్నారు. ఎస్సీలకు భూమి హక్కు కల్పిస్తామని పేర్కొన్నారు. ఎస్సీలకు 20 లక్షల ఎకరాల ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు.
Telangana walks with it’s beloved leader Rahul Gandhi ji. #ManaTelanganaManaRahul#BharatJodoYatra#Day3 pic.twitter.com/h6PfzSymdA
— Revanth Reddy (@revanth_anumula) October 28, 2022
అటవీ హక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలుచేస్తామని, లక్షలాదిమంది గిరిజనులకు కాంగ్రెస్ భూములు ఇచ్చిందని, తెలంగాణలో రాచరిక పాలన సాగుతున్నదన్నారు. దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీలు హింసను ప్రేరేపిస్తున్నాయని, అన్నదమ్ముల్లా ఉండే మన మధ్య గొడవలు పెడుతున్నదన్నారు. బీజేపీ విద్వేషం సృష్టిస్తుంటే టీఆర్ఎస్ సహకరిస్తున్నదని విమర్శించారు.
LIVE: #BharatJodoYatra | Marikal to Oblaipalle | Narayanpet to Mahbubnagar | Telangana https://t.co/LBXzCpEKF2
— Bharat Jodo (@bharatjodo) October 28, 2022