Site icon vidhaatha

Naveen Mittal | ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువు ఈ నెలాఖరు వరకు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ

Naveen Mittal

విధాత: జీవో 58,59 ల కింద ఇండ్ల స్థలాల క్రమబద్ధీకర గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈనెల31వ తేదీ వరకు పొడిగించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌కు చెందిన ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువును పొడిగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జీవో 58,59 ల కింద దరఖాస్తు చేసుకోవడానికి ఈనెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Exit mobile version