Meme Boy | తన నవ్వుతో సోషల్‌‌మీడియాను ఊపేసిన బాలుడు.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా!

Meme Boy | ఒకప్పుడు తన నవ్వుతో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన చిన్న పిల్లాడు గుర్తున్నాడా? ఆ వీడియో వచ్చి కొన్ని ఏండ్లు అయిన్పటికీ దాని క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఇప్పటికీ చాలామంది దీన్ని మీమ్స్‌గా వాడుతూనే ఉన్నారు. మరి ఆ మీమ్ బాయ్‌ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడో తెలుసా!

Meme Boy | ఇంటర్నెట్‌లో రోజుకో టాపిక్ వైరల్ అవుతూనే ఉంటుంది. వాటిలో కొన్ని ఎన్ని ఏండ్లు గడిచినా ప్రజల మదిలో నిలిచిపోతుంటాయి. అలాంటి వీడియోల్లో ఒకటి ఛాయ్ తాగుతున్న ఓ చిన్న పిల్లాడి నవ్వు. ఆ వీడియో చూసి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది నవ్వుకుని ఉంటారు.. ఇప్పటికీ ఆ బాలుడి నవ్వును చాలా వీడియోల్లో మీమ్స్‌గా వాడుతూనే ఉంటారు. మరి కోట్లాది మందిని ఇప్పటికీ నవ్విస్తున్న ఆ బాలుడు ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడో తెలుసా!

సోషల్‌మీడియాలో మీమ్ బాయ్‌గా ఫేమస్ అయిన ఆ చిన్న బాలుడి పేరు అరుణ్‌కుమార్. ఒకప్పుడు పేదరికం కారణంగా చదువు మధ్యలో ఆపేయాల్సి రావడంతో ఒక ట్రక్ క్లీనర్‌గా చేరిన అతను ఇప్పుడు తన జీవితంలో ఒక మైలురాయిని దాటాడు. చిన్నతనంలో ఆపేసిన చదువును కొనసాగించి, తాజాగా పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

కొన్నేండ్ల క్రితం అరుణ్‌కుమార్ నవ్వుతున్న 15 సెకండ్ల చిన్న వీడియో వైరల్ అయ్యింది. టీ బ్రేక్ సమయంలో ట్రక్ డ్రైవర్ తీసిన ఆ వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేశాడు అందులో అరుణ్‌కుమార్ నవ్విన విధానం నెటిజన్లను ఆకట్టుకుంది. దీంతో తక్కువ సమయంలోనే ఆ వీడియోను లక్షలాది మంది చూసి షేర్ చేయడంతో అది కాస్త ప్రపంచవ్యాప్తంగా మీమ్‌గా మారింది.

అయితే అరుణ్‌కుమార్ నవ్వుతున్న వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీమ్‌గా ఉంది. కానీ ఆ నవ్వు వెనుక ఉన్న జీవితం మాత్రం అంత సులభంగా లేదు. హ్యూమన్ ఆఫ్ బాంబే ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన అరుణ్ చిన్నతనం నుంచే చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. పేదరికం కారణంగా నాలుగో తరగతిలోనే చదువు ఆపేశాడు. అప్పుడు అరుణ్‌ వయసు కేవలం పదేండ్లు మాత్రమే. ఆ వయసులో కుటుంబానికి అండగా ఉండేందుకు పనిలో చేరాల్సి వచ్చింది.

నెహ్రూ అనే ట్రక్ డ్రైవర్ అరుణ్‌కుమార్‌ను క్లీనర్‌గా పెట్టుకున్నాడు. అప్పట్నుంచి అతన్ని తన సహాయకుడిగా సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. అలా ఒకసారి టీ బ్రేక్‌లో మాట్లాడుతుండగా అరుణ్ కుమార్ నవ్వుతున్న వీడియోను తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. అది కాస్త వైరల్ అయ్యింది.

ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. ఆ వీడియో వైరల్ అయినప్పుడు జనాల నుంచి వచ్చిన కామెంట్లు చదవగలిగే స్థితిలో కూడా అరుణ్‌ లేడు. అది చూసిన నెహ్రూ తీవ్ర ఆలోచనలో పడిపోయాడు. తనలాగే ఈ పిల్లాడి జీవితం ఇక్కడే ట్రక్ చక్రాల మధ్య ఉండిపోకూడదని భావించాడు. ఈ క్రమంలో నెహ్రూ చాలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ బాలుడి భవిష్యత్తు ఇలా ఉండకూడని భావించాడు. అతనికి కొన్ని పుస్తకాలు కొనిచ్చి చదువు చెప్పించడం మొదలుపెట్టాడు.

తమ ట్రక్ ప్రయాణంలోనే బ్రేక్ దొరికినప్పుడల్లా చదువు చెప్పేవాడు. ఆ సమయంలోనే అక్షరాలు, లెక్కలు నేర్పాడు. అరుణ్ కూడా చాలా శ్రద్ధగా వాటిని నేర్చుకునేవాడు. ఈ క్రమంలోనే తాజాగా అరుణ్ కుమార్ పదో తరగతి పరీక్షలను రాశాడు. వేటుగా పదో తరగతి రాసేందుకు అవసరమైన ఫీజులు కూడా నెహ్రూనే చెల్లించాడు.

నెహ్రూ ప్రోద్బలంతో కష్టపడి చదివిన అరుణ్‌కుమార్ చివరకు తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. గత ఏడాది పదో తరగి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. దీంతో మరోసారి అరుణ్ వార్తల్లోకి ఎక్కాడు. ఒకప్పుడు తన నవ్వుతో పాపులర్ అయిన చిన్న పిల్లాడు ఇప్పుడు తన కృషితో మరోసారి అందర్నీ దృష్టిని ఆకర్షించాడు. ఇది తెలిసిన నెటిజన్లు అరుణ్‌కుమార్ కష్టాన్ని అభినందిస్తున్నారు.

కాగా, ఇప్పటికీ పేదరికం కారణంగా తన బావ నెహ్రూ దగ్గర అరుణ్ క్లీనర్‌గానే పనిచేస్తున్నాడు. తనను వెన్నంటి ప్రోత్సహించిన తన బావను ఎప్పటికీ వదలనని.. ఆయనతో కలిసి పనిచేసుకుంటానని అరుణ్ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Read More:

 సీబీఎస్ఈ 12వ తరగతి క్యూఆర్ కోడ్ లో యూ ట్యూబ్ సాంగ్ !

Doomsday Fish | మెక్సికో బీచ్‌కు కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తు ముంచెత్తనుందా?

Latest News