రోడ్డు ప్రమాదంలో చిరుత పులి మృతి

నాగర్‌కర్నూల్ జిల్లాలో హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి చెందింది. ఘటనపై అటవీశాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 17, 2026, 3:57 pm IST
Read Time: 3 mins
రోడ్డు ప్రమాదంలో చిరుత పులి మృతి

వన్యప్రాణులు అభయారణ్యాలలో రోడ్డు దాటుతూ మృతి చెందడం ఇటీవల పెరిగిపోతుంది. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత పులి అక్కడిక్కడే మృతి చెందింది.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు, అటవీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇటీవల తరుచూగా పెద్ద పులులు, చిరుత పులి శ్రీశైలం ఘాట్ రోడ్డు మార్గంలో రోడ్డు దాటుతున్న వీడియో దృశ్యాలు కనిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు వాహనదారులను వన్యప్రాణుల సంచారం నేపథ్యంలో నెమ్మదిగా వెళ్లాలని సూచికలు ఏర్పాటు చేశారు. అయినప్పటికి వాహనం ఢీ కొట్టి ఓ చిరుత మృతి చెందడం విచారకరం.