విధాత: రూ.7 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఎటువంటి పన్ను ఉండబోదని తాజా బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను పార్లమెంట్‌లో బుధవారం ప్రకటించిన కొత్త పద్దులో నూతన పన్నుల విధానాన్నిపరిచయం చేశారు.
దీని ప్రకారం రూ.5 లక్షల నుంచి 7 లక్షలకు ఆదాయం పన్ను (ఐటీ) రిబేటు పరిమితిని పెంచారు. అలాగే నాలుగు కొత్త శ్లాబులను తీసుకొచ్చారు. ఇక రూ.3 లక్షల వరకు ఏ రకమైన పన్నుండదు. రూ.3 లక్షల నుంచి 6 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ.6 లక్షల నుంచి 9 లక్షలదాకా 10 శాతం, రూ.9 లక్షల నుంచి 12 లక్షలకు 15 శాతం, రూ.12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20 శాతం, రూ.15 లక్షలపైన వార్షిక ఆదాయం ఉంటే 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
ధరలు తగ్గేవి: టీవీలు, కెమెరాలు, మొబైల్స్, లిథియం బ్యాటరీ
ధరలు పెరిగేవి: సిగరెట్లు, వెండి, బంగారం, వజ్రాలు, టైర్లు, రెడీమేడ్ వస్త్రాలు,