Site icon vidhaatha

భారత్‌లో నిజం మాట్లాడలేని దుస్థితి: ఇజ్రాయిల్‌ ఫిల్మ్‌మేకర్‌ నాడ‌వ్ లాపిడ్‌

విధాత: భారత్‌తో సహా కొన్ని దేశాల్లో నిజం మాట్లాడలేని దుస్థితి ఉన్నదని ఇజ్రాయిల్‌ ఫిల్మ్‌మేకర్‌ నాడవ్‌ లాపిడ్‌ అన్నారు. గోవాలో జరుగుతున్న ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అతిథిగా గోవా వచ్చిన ఆయన ఈ మధ్య కాలంలో పలు దేశాల్లో నిజాన్ని మాట్లాడలేని పరిస్థితులు పెరిగిపోతున్నాయని విమర్శించారు.

దానికి ప్రతీకగా ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాను ఉదహరిస్తూ.. అది ప్రభుత్వం తలపెట్టిన దుష్ట ప్రచారమన్నారు. ఇజ్రాయిల్‌ ప్రభుత్వ పోకడలను కూడా తీవ్రంగా విమర్శించే లాపిడ్‌ ఆయా దేశాల్లో ఉన్న ప్రభుత్వాల అసహన రూపాలను ఎత్తి చూపారు. అయితే.. అయనను ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమానికి అతిథిగా పిలిచి తిట్టించుకొన్నట్లుగా ఉన్నదనటం గమనార్హం. కాగా ఆయన వ్యాఖ్యలకు ప్రముఖ నటులు మద్దతు తెలిపారు.

Exit mobile version