Site icon vidhaatha

Not Married..Mother Of Twins: పెళ్లే చేసుకోలేదు..40ఏళ్ల వయసులో కవలలకు తల్లి కాబోతున్నా: ప్రముఖ కన్నడ నటి ప్రకటన

విధాత: ఓ ప్రముఖ కన్నడ నటి తాను పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నానని..40 ఏళ్ల వయసులో కవల పిల్లలను కనబోతున్నానంటూ సంచలన ప్రకటన చేసింది. పెళ్ళికాకుండా తల్లి అవ్వాలనుకునే స్త్రీలకు ప్రేరణగా నిలవ బోతున్నాంటూ కూడా ఆమె చేసిన ప్రకటన వైరల్ గా మారింది. ఇంతకీ ఎవరా నటి? ఎందుకు ఇలాంటి విలక్షణ నిర్ణయం తీసుకుందన్న వివరాలలోకి వెళితే ప్రముఖ కన్నడ నటి భావన రామన్న తాను గర్భం దాల్చినట్టు ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ వేదికగా పేర్కొంది. తాను ఐవీఎఫ్‌(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ప్రక్రియ ద్వారా త్వరలోనే కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నా అంటూ వెల్లడించింది. అంతేకాదు తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆరు నెలల బేబీ బంప్‌తో రెండు చిత్రాలను పోస్ట్ చేసింది. చాలా మంది మహిళలు బిడ్డను కనాలనే కలలకు తాను ప్రతిరూపమంటూ ఈ భావోద్వేగ ప్రయాణం ఎలా ఒడిదుడుకులతో నిండి ఉందో వివరించింది. ఒంటరి మహిళగా తన ప్రయాణ అనుభవాలను పంచుకుంది.

“ఇదొ కొత్త అధ్యాయం, ఇది నేను ఊహించలేదని.. తాను ఇప్పుడు కవలలతో ఆరు నెలల గర్భవతిని అని భావన పేర్కొంది. 20-30 ఏళ్లపుడు తల్లినవ్వాలని అస్సలు అనుకోలేదని.. కానీ నాకు 40 ఏళ్లు నిండిన తరువాత ఆ కోరికను కాదనలేకపోయానని తెలిపింది. ఇపుడు ఇద్దరికి జన్మనివ్వబోతున్నానని..అది కూడా ఒంటరి మహిళగా అని పేర్కొంది. ‘‘ఇదేదో సామాజిక తిరుగుబాటుగా ఈ నిర్ణయం తీసుకోలేదని… తల్లి కావాలనుకున్న నా కోరికను గౌరవించడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని. నా స్టోరీ కనీసం ఒక మహిళను ఇన్‌స్పైర్‌ చేసినా నాకు అది చాలు అని పేర్కొనడం విశేషం. నిజానిని తల్లి కావాలనుకున్న నా ఈ జర్నీ అంత సులభంగా సాగలేదని…ఇందుకోసం తాను చాలా ఐవీఎఫ్ క్లినిక్‌లు తిరిగానని..వైద్యులు ఈ ప్రయత్నం విరమించుకోవాలని సూచించారని..అయిన పట్టుదలతో సాధించాని చెప్పుకొచ్చారు. తన పిల్లలకు తండ్రి ఉండరని తెలుసు..అయితే వారు కళ, సంగీతం, సంస్కృతి, ఎల్లలులేని ప్రేమతో నిండిన ఇంట్లో పెరుగుతారు. ఏంతో ప్రేమగా నమ్మకమైన చేతుల్లో పెరుగుతారు’’ అని భావన స్పష్టం చేసింది. ఇంత కష్టమైన సమయంలో తనకు అండగా నిలిచిన, తల్లిదండ్రులు, తోబుట్టువులకు, తల్లి కావాలన్న తన కల సాధనలో తోడ్పడిన డాక్టర్ సుష్మకు భావన కృతజ్ఞతలు తెలిపింది.

 

Exit mobile version