‘కాళోజీ’లో కన్వీనర్ కోటా పీజీ వైద్య సీట్ల భర్తీకి మరో ప్రకటన జారీ

ఈ నెల 12 వరకు వెబ్ ఆప్షన్లు ఖాళీ సీట్ల భర్తీకి మరో అవకాశం విధాత, వరంగల్: పీజీ వైద్య విద్య కన్వీనర్ కోటా సీట్లకు మరో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. ఇంకా ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మరో అవకాశం కల్పిస్తూ తాజాగా ఎంసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ బుధవారం స్పెషల్ స్ట్రె (STRAY) విడత ప్రవేశాలకు ప్రకటన విడుదల చెసింది. తుది మెరిట్ జాబితాలోని […]

  • Publish Date - January 11, 2023 / 02:34 PM IST
  • ఈ నెల 12 వరకు వెబ్ ఆప్షన్లు
  • ఖాళీ సీట్ల భర్తీకి మరో అవకాశం

విధాత, వరంగల్: పీజీ వైద్య విద్య కన్వీనర్ కోటా సీట్లకు మరో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. ఇంకా ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మరో అవకాశం కల్పిస్తూ తాజాగా ఎంసీసీ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో యూనివర్సిటీ బుధవారం స్పెషల్ స్ట్రె (STRAY) విడత ప్రవేశాలకు ప్రకటన విడుదల చెసింది. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే నాలుగు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. ఇంకా ఖాళీగా ఉన్న సీట్లను ఈ చివరి విడత కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు.

బుధవారం సాయింత్రం 5 గంటల నుండి ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారిగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హత, ఇతర వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్సైట్ http://www.knruhs.telangana.gov.in లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.