Odisha Train Accident | ఒడిశా రైలు ప్ర‌మాదం.. ఏరియ‌ల్ వ్యూ దృశ్యాలు విడుద‌ల‌..

Odisha Train Accident | ఒడిశాలోని బాలాసోర్ జిల్లా ప‌రిధిలోని బ‌హ‌నగా రైల్వే స్టేష‌న్ స‌మీపంలో నిమిషాల వ్య‌వ‌ధిలోనే మూడు రైళ్లు ఢీకొన్న ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని విషాదంలోకి నెట్టివేసింది. #WATCH | Latest aerial visuals from ANI’s drone camera show the extent of damage at the spot of the #BalasoreTrainAccident in Odisha. pic.twitter.com/kTFOLuKDrd — ANI (@ANI) June 3, 2023 ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో 280 […]

  • Publish Date - June 3, 2023 / 12:45 PM IST

Odisha Train Accident |

ఒడిశాలోని బాలాసోర్ జిల్లా ప‌రిధిలోని బ‌హ‌నగా రైల్వే స్టేష‌న్ స‌మీపంలో నిమిషాల వ్య‌వ‌ధిలోనే మూడు రైళ్లు ఢీకొన్న ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని విషాదంలోకి నెట్టివేసింది.

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో 280 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 900 మందికి పైగా ప‌లు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అయితే సిగ్నలింగ్ వ్య‌వ‌స్థ‌లో లోప‌ంతోనే ఈ ప్ర‌మాదం జరిగినట్లు అధికారులు నివేదిక సమర్పించారు. ప్ర‌స్తుతానికి అయితే ఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు ముగిశాయి.

ఈ ఘోర ప్ర‌మాద ఘ‌ట‌న‌ను ప‌లు జాతీయ చానెల్స్ డ్రోన్ల ద్వారా చిత్రీక‌రించాయి. మూడు రైళ్ల బోగీలు చెల్లాచెదురుగా ప‌డిపోయాయి.

ప్ర‌యాణికుల మృత‌దేహాలు తునాతున‌క‌లైపోయాయి. వారి బ్యాగులు, ఇత‌ర సామాగ్రి న‌లిగిపోయాయి. ఆ దృశ్యాల‌ను చూస్తుంటే భీతావాహ ప‌రిస్థితిని త‌ల‌పిస్తోంది.