OG and Ustaad
విధాత: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా వరుస సినిమాలతో, వాటి అప్‌డేట్స్‌తో చెలరేగిపోతున్నాడు. పార్టీ నడపడం కోసం వేరే వ్యాపారాలు లేవని చెబుతున్న పవన్ కల్యాణ్.. తనకు తెలిసిన యాక్టింగ్‌నే నమ్మకుంటున్నాడు. రాబోయే ఎలక్షన్స్ లోపు.. వీలైనన్ని సినిమాలు చేసి.. చేతిలో కాసిన డబ్బులు ఉంచుకోవాలనేది ఆయన ప్లాన్‌గా తెలుస్తోంది.
దీని కోసం ఆయన అంతే ఇదిగా కష్టపడుతున్నారు. ఇప్పటికే అంగీకరించిన సినిమాలను పూర్తి చేసేందుకు ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారనేది.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మోగిపోతున్న అప్‌డేట్స్‌ను చూస్తుంటే తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే ఫ్యాన్స్‌ని ఊపిరి పీల్చుకోనివ్వనంతగా.. ఆయన సినిమాల అప్‌డేట్స్‌ని మేకర్స్ వదులుతున్నారు.
ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం చివరి దశ చిత్రీకరణలో ఫాజ్‌లో ఉండిపోయింది. ఈ చిత్ర చివరి షెడ్యూల్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం అవుతుందని అంటున్నారు. ఈ లోపు పవన్, సుజీత్‌తో చేస్తున్న ‘ఓజీ’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
తాజాగా ఈ చిత్ర షెడ్యూల్ పూణేలో ప్రారంభమైనట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రెండో షెడ్యూల్ కూడా వెంటనే ప్రారంభించు కోవడంతో.. పవన్ కల్యాణ్ పరుగులు పెట్టిస్తున్నాడనే టాక్‌కు కారణమవుతోంది.
Pune… You have our heart.