విశ్వక్‌సేన్ (Vishwaksen)కథానాయకుడిగా నటించిన నూతన చిత్రం లైలా (Laila). ఆకాంక్షశర్మ కథానాయికగా నటించింది. విశ్వక్ ఫస్ట్ టైం లేడీ గెటప్‌లో నటిస్తుండడం గమనార్హం. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన పాటలు మంచి ఆదరణను దక్కించుకోవడంతో తాజాగా ఓహో రత్తమ్మ అంటూ సాగే పాటు విడుదల చేశారు. పెంచల్ దాస్ ఈ పాటకు సాహిత్యం అందించగా పెంచల్ దాస్, మధు ప్రియ ఆలపించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.