Site icon vidhaatha

ఎంపీ కోమటిరెడ్డికి మరోసారి కాంగ్రెస్ నోటీసులు.. స్పందించకుంటే.. సస్పెండ్‌?

విధాత: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మరోసారి నోటీసులు ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తన తమ్ముడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పడంపై రేగిన వివాదంలో రెండు వారాల క్రితం కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ వెంకట్ రెడ్డిని వివరణ కోరుతూ జారీ చేసిన నోటీస్లపై ఆయన ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

పారసిటమాల్ వేసుకుంటున్నారా? ఇటువైపు ఓ కన్నెయ్యండి!

తొలి నోటీస్ గడువు నవంబర్ 1వ తేదీకి ముగిసిపోగా , ఆయన ఆ సమయంలో ఆస్ట్రేలియాకు వెళ్లి ఇటివలే తిరిగి వచ్చారు. వెంకటరెడ్డి వచ్చిన సమయానికి రాహుల్ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగుతున్న ప్పటికీ ఆయన పాదయాత్రలో పాల్గొనక పోవడం పార్టీ వర్గా లలో చర్చనీయాంశమైంది.

యాక్టివాలోకి దూరిన నాగుపాము.. ఈ వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..

తొలి విడత నోటీసులకు స్పందించని వెంకటరెడ్డి కనీసం రెండో విడత షోకాజ్ నోటీసుల కైనా సమాధానం చెబుతారా లేక తమ్ముడు దారిలో పార్టీ విడిపోతారా అన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ సారి స్పందించకుంటే.. సస్పెండ్‌ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆ పార్టీలో చర్చ జరుగుతున్నది.

షేక్‌ అవుతున్న ఇంటర్నెట్.. ఈ వీడియో చూసే దమ్ముందా..?

Exit mobile version