- అవార్డు గ్రహీతలకు అవార్డులను అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
విధాత: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) పద్మ అవార్డు(Padma Awards)లను బహుకరించారు. 54 మందికి పద్మ అవార్డుల ప్రధానం, ముగ్గురికి పద్మ విభూషణ్, నలుగురికి పద్మభూషణ్ పురస్కారాలు అందించారు.
కమలేష్ డి పటేల్ కు పద్మభూషణ్, కుమార మంగళం బిర్లాకు పద్మభూషణ్ అందించారు. ఏపీకి చెందిన డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్‌కు పద్మశ్రీ, తెలంగాణకు చెందిన డాక్టర్ ఎం.విజయ గుప్తాకు పద్మశ్రీ, రామకృష్ణారెడ్డికి పద్మశ్రీ, డాక్టర్ హనుమంతరావుకు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.
ఏపీకి చెందిన చింతలపాటి వెంకటపతి రాజుకు పద్మశ్రీ, ప్రొఫెసర్ ప్రకాష్ చంద్రసూద్‌కు పద్మశ్రీ, కోట సచ్చిదానంద శాస్త్రికి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.