Site icon vidhaatha

Patnam Mahender Reddy | మంత్రిగా భాధ్యతలు స్వీకరించిన పట్నం మహేందర్ రెడ్డి

Patnam Mahender Reddy |

విధాత : రాష్ట్ర భూగర్భ వనరులు, ఐఆర్‌పీఆర్‌ శాఖ మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయం మొదటి అంతస్తులో పూజల అనంతరం ఐ&పీఆర్, భూగర్భ వనరుల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహేందర్‌రెడ్డి తన ముందు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ఐఆండ్‌పీఆర్‌ కమిషనర్ అశోక్ రెడ్డి పెట్టిన తొలి ఫైల్ పై సంతకం చేశారు.

మంత్రి పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, కృష్ణారావు, బాల్కా సుమన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు,

పట్నం కుటుంబ సభ్యులు, వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీత రెడ్డి, కుమారుడు పట్నం రినీష్ రెడ్డి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జర్నలిస్టులు హజారీ, మారుతి సాగర్, బసవ పున్నయ్య, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version